అమ్మకొంగు పట్టుకుని వచ్చి.. అనంత లోకాలకు

16 Months Little Boy Dies In Auto Accident - Sakshi

ఆటో కిందపడి 16 నెలల బాలుడు మృతి 

కథలాపూర్‌(వేములవాడ): అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న బాలుడు అమ్మకొంగు పట్టుకుని వచ్చి అనంతలోకాలు చేరాడు. కథలాపూర్‌ మండలం తాండ్య్రాల గ్రామంలో ఆటో ఢీకొనడంతో రాస రియన్స్‌(16 నెలలు) మంగళవారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తాండ్య్రాల గ్రామానికి చెందిన రాస గణేశ్‌–తేజస్విని దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు రియన్స్‌ ఉన్నాడు. గ్రామానికి మంగళవారం రాత్రి వంటగ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసే ఆటో వచ్చింది. తేజస్విని సిలిండర్‌ తీసుకునేందుకు వచ్చింది. వెంట రియన్స్‌ వచ్చాడు.

తేజశ్విని చిల్లర డబ్బుల కోసం బాలుడిని ఇంటిముందు వదిలి లోపలికి వెళ్లింది. ఇంతలో బాలుడిని గమనించని డ్రైవర్‌ ఆటోను రివర్స్‌ తీశాడు. ఆటో రియన్స్‌ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌తోపాటు అసిస్టెంట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు.  
చదవండి: మేనకోడలిని దారుణంగా చంపేశాడు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top