మేనకోడలిని దారుణంగా చంపేశాడు!

Bulandshahr: Man Has Affair With Married Niece And Killed Her With Suspicion - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు, ఆకృత్యాలు మాత్రం ఆగటంలేదు. తాజాగా, యూపీలో ఒక వ్యక్తి తన మేనకోడలిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం, యూపీలోని బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి తన మేనకోడలితో వివాహేతర సంబంధాన్నికలిగి ఉన్నాడు. కాగా, ఆ మహిళకు ఇది వరకే పెళ్ళిఅయి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కలసి నోయిడాలోని తమ బంధువుల ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ మహిళకు అత్తవారింటి నుంచి ఒత్తిడి రావడంతో ఆమె తిగిరి వాళ్ళింటికి చేరుకుంది. వినీత్‌ను అతని సోదరి ఇంటికి పంపించేశారు.

కాగా, వినీత్‌ తన మేనకోడలిపై కోపం పెంచుకొన్నాను. తనను కావాలనే మోసం చేసిందని ఆమె ఇంటికి చేరుకొన్నాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో ఆమెపై దాడిచేశాడు. దీంతో​ ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను బంధువులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కోరికను తీర్చాలన్న కామాంధుడికి యావజ్జీవం!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top