
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,40,048కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,341కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ( కోలుకున్న రొనాల్డో )
నిన్న ఒక్క రోజే 1,579 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,20,466కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 15,388 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 43,23,666కి చేరింది.