హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ బృందం | 12 Farmers Trapped In River In Jayashankar District | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం

Aug 15 2020 3:32 PM | Updated on Aug 15 2020 6:24 PM

12 Farmers Trapped In River In Jayashankar District - Sakshi

సాక్షి, జయశంకర్‌ జిల్లా: టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ బృందం రక్షించారు. రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎంపీపీ మల్లారెడ్డి ఫోన్‌లో సమాచారం అందించారు. రైతులను రక్షించాలంటూ ఆయన తక్షణమే మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌లో వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ఘటనాస్థలికి హెలికాఫ్టర్‌ పంపాలని సీఎస్‌తో మాట్లాడారు. తక్షణమే హెలికాప్టర్‌ ద్వారా రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేపట్టాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రైతులు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement