ఈ ఐదు దేశాల్లో అసలు నదులే లేవు.. | Five Countries Without Rivers And Their Special Facts | Sakshi
Sakshi News home page

ఈ ఐదు దేశాల్లో అసలు నదులే లేవు..

Jun 1 2026 8:37 AM | Updated on Jun 1 2026 7:34 PM

Five Countries Without Rivers And Their Special Facts

నదులు లేని దేశాలు

డిసాలినేషన్‌ సాంకేతికత

నది ఉన్న చోటే నాగరికత వెలుస్తుంది. నది లేని చోట ఉండరాదు అని ఆచార్య చాణిక్యుడు కూడా చెప్పాడు. నదుల వల్ల నీటి లభ్యతే కాదు, రవాణా సౌకర్యం, వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు కూడా అందుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు నదులే లేవు. అందులో ‘ఐదు’ దేశాల గురించి తెలుసుకుందాం.

1. సౌదీ అరేబియా
అరేబియా ద్వీపకల్పంలోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఈ దేశంలో ఒక్క నదీ లేదు. కానీ ఆధునిక డిసాలినేషన్‌ సాంకేతికత సాయంతో భూగర్భంలో ఉన్న నీటిని వినియోగించుకుంటుంది ఈ దేశం.

2. బహ్రెయిన్‌
ఈ చిన్న ఐలాండ్‌ దేశంలో నది లేదు . అందుకే తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలపై, అడ్వాన్స్‌ డిసాలిటేషన్‌ టెక్నాలజీపై ఆధారపడతారు.

3. కువైట్‌
తన పొరుగు దేశాల్లాగే కువైట్‌ కూడా నదీజలాలపై ఆధారపకుండా నాగరికతను ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ప్రధానంగా డిసాలినేషన్‌ ప్లాంట్స్‌ వల్లే నీరు అందుతుంది. దీంతో పాటు వర్షాకాలలో ఎండిపోయిన నదుల్లో చేరిన నీటిని కూడా వినియోగించుకుంటారు.

4.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
యూఏఈలో నదులు లేకపోయినా అది తన ప్రజల అవసరాల కోసం నీటిని అందించేందుకు ఆధునిక సాంకేతిక సాయం తీసుకుంటోంది. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడం వంటి విధానాలతో పాటు, అత్యాధునిక డిసాలినేషన్‌ సాంకేతికత వల్ల ప్రజల దాహాన్ని తీర్చగలుగుతోంది.

5. ఖతార్‌
ఖతార్‌లో మంచి నీటిని మొత్తం డిసాలినేషన్‌ ప్రాసెస్‌లో సేకరించడంతో పాటు దిగుమతి చేసుకుంటారు. దీన్ని బట్టి ఆ దేశంలో నీరు ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. చుక్క చుక్కను ఒడిసిపట్టుకుని జాగ్రత్తగా వాడుతారు.

డిసాలినేషన్‌ అంటే..
డిసాలినేషన్‌ అంటే సముద్రపు నీరు లేదా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిలోని ఉప్పు, ఇతర మలినాలను తొలగించడం. ఈప్రాసెస్‌ పూర్తి చేసి ఈ నీటిని ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ నీటిని తాగడానికి, సాగుకోసం, పరిశ్రమల కోసం వినియోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement