Kokapet: రూ.100 కోట్ల స్థలానికి ఎసరు! | 100 crores land kabza in hyderabad | Sakshi
Sakshi News home page

Kokapet: రూ.100 కోట్ల స్థలానికి ఎసరు!

Jul 23 2024 12:01 PM | Updated on Jul 23 2024 12:01 PM

100 crores land kabza in hyderabad

    కోకాపేట్‌ హెచ్‌ఎండీఏ స్థలంలో అక్రమార్కుల పాగా 

    అడ్డుకున్న హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 

సాక్షి, హైదరాబాద్: కోకాపేట్‌లో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలంలో పాగా వేసేందుకు కబ్జారాయుళ్లు పన్నిన పథకా న్ని హెచ్‌ఎండీఏ అధికారులు అడ్డుకున్నారు. కోకాపేట్‌లోని సర్వే నంబర్‌ 117లో ఉన్న 2.5 ఎకరాల హెచ్‌ఎండీఏ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కంటైనర్లు, డబ్బాలను ఏర్పాటు చేశారు. 

ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టేట్‌ అధికారులు వాటిని గుర్తించి తొలగించారు. హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్‌పీ జానకీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడు ల్లో  ఎస్టేట్‌ విభాగం ఉద్యోగులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇటీవల  మియాపూర్‌లో హెచ్‌ఎండీఏ స్థలాల్లో నిరి్మంచిన అక్రమ కట్టడాలపైన ఉక్కు పాదాన్ని మోపిన సంగతి తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ఫెన్సింగ్‌ ఏర్పాటు  చేశారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ భూములను జియోఫెన్సింగ్‌ చేయనున్నట్లు అధికారులు  తెలిపారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement