ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా.. పెళ్లి చేశా..!  | MP Soyam Bapurao Video Viral Adn He Reacts | Sakshi
Sakshi News home page

ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా.. పెళ్లి చేశా..! 

Jun 20 2023 8:41 AM | Updated on Jun 20 2023 9:00 AM

MP Soyam Bapurao Video Viral Adn He Reacts - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నానని, పెళ్లి చేశానని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యల వీడియో కల కలం రేపింది. కానీ తాను అలా అనలేదని, ఓర్వలేక దు్రష్పచారం చేస్తున్నారని ఆయన ఖండించ డం గమనార్హం. సోయం బాపురావు ఈ నెల 16న ఆదిలాబాద్‌లోని తన నివాసంలో స్థానిక బీజేపీ నేతలతో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంపై  మా ట్లాడారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో సో మవారం వైరల్‌గా మారింది. అందులో.. ‘మొదటిసారి పార్టీ బలోపేతం కోసం, రెండోసారి రెండున్నర కోట్లలో ఇల్లు, కొడుకు పెళ్లి కోసం ఎంపీ ల్యాడ్స్‌ వాడిన. ఈ మాటను ఏ నాయకుడు కూడా ఒప్పుకోడు. ఇంకోసారి నా స్వార్థం కోసం వాడను. అంత కుముందు దద్దమ్మ ఎంపీలు మొత్తం వాడుకున్నారు. ఈసారి ఇంకా ఏ ఎంపీకి కూడా నిధులు రాలేదు. ఈసారి వచ్చే రూ.5 కోట్లు మీకే.. ఒక్కొక్కరికి రూ.ఐదేసి లక్షల చొప్పున నిధులు ఇస్తా..’అని బాపురావు పేర్కొన్నట్టుగా ఉంది. 

తెలివిలేని ఆరోపణలు: సోయం బాపురావు 
సోమవారం సోయం బాపురావు దీనిపై స్పందించారు. ‘నేను ఇల్లు కట్టుకోవడం, కొడుకు పెళ్లిలో బి జీగా ఉన్నానని చెప్పానే తప్ప.. ఇంటికోసం ని ధు లు వాడినట్టు చెప్పలేదు. ఎంపీ నిధుల వినియోగానికి ఒక సిస్టం ఉంటుంది. కొందరి ఆటలు సాగక ఆరోపణలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement