Minister KTR Will Inaugurate Uppal Skywalk Today In Hyderabad, Know Its Specialities - Sakshi
Sakshi News home page

Uppal Skywalk Inauguration: నేడు ఉప్పల్‌ స్కైవాక్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

Published Mon, Jun 26 2023 10:28 AM

Minister KTR Will Inaugurate Uppal Skywalk in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నగరవాసులకు మరో గుడ్‌న్యూస్‌. ఉప్పల్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఉప్పల్‌ చౌరస్తాలో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను హెచ్‌ఎండీఏ నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్‌లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్‌ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇక.. పాదచారులు, ప్రయాణీకులు ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్‌, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేష‌న్, ఉప్పల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ బిగ్‌ ప్లాన్‌.. 500 వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్‌..

Advertisement
Advertisement