Hyderabad Man Married Transgender Pinky At Vemulavada Temple, Details Inside - Sakshi
Sakshi News home page

వేములవాడ రాజన్న సన్నిధిలో హిజ్రాను మనువాడిన యువకుడు

Jun 17 2023 2:11 PM | Updated on Jun 17 2023 4:15 PM

Hyderabd Man Married Transgender Pinky At Vemulavada Temple - Sakshi

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. అయితే వాళ్లిద్దరూ అమ్మాయి, అబ్బాయి కాదు.. అమ్మాయి, అమ్మాయి కాదు.. అబ్బాయి, అబ్బాయి అంతకన్నా కాదు.. కానీ, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెమొక్కులు చెల్లించుకుని ఆ నందీశ్వరుడి సాక్షిగా.. మనసున మనసై అని పాడుకుంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వారిలో ఒకరు హిజ్రా అయితే.. ఇంకొకరు ఓ యువకుడు.

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాను.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది. డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా పింకీ, శీనుల వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

​కాగా ఇటీవల ఇలాంటి వివాహమే  మహబూబాబాద్ జిల్లాలో  జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) కి రైలులో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement