కన్నుల పండువగా తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా తెప్పోత్సవం

Nov 27 2026 2:14 AM | Updated on Nov 27 2026 2:14 AM

● స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో బుధవారం రాత్రి చంద్రశేఖరుని తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ పుష్పర్కణిలో తెప్పలపై విహరిస్తూ అన్నామలైయార్‌ సమేత ఉన్నామలై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అరుణాచలేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఈనెల 24న ఆలయ కొండపై మహా దీపాన్ని వెలిగించారు. గత పది రోజుల పాటు స్వామి వార్లు వివిధ వాహణాల్లో ఉదయం, సాయంత్రం మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో అలసిపోయిన స్వామి వార్లకు ఏటా ఆఖరి రోజున తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు ఘనంగా తెప్పోత్సవం జరిగింది. ముందుగా తెప్పను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణీధరణ్‌ అధ్యక్షతన వివిధ పుష్పాలతో అలంకరించారు. తొలుత అన్నామలైయార్‌ సమేత ఉన్నామలైయార్‌ అమ్మవారు, ఉత్సవ మూర్తులకు శివాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి తెప్పలపై ఆశీనులు చేశారు. అశేష భక్తజనం హరోంహరా.. నామస్మరణం మధ్య తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. తెప్పోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరింపజేశాయి. అలాగే ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. గురువారం ఉదయం 5.30 గంటలకు అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవార్లను రాజగోపురం నుంచి మేళ తాళాల నడుమ గిరివలయం రోడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు, కర్పూర హారతలు పట్టి గిరివలం రోడ్డులోని 14 కిలో మీటర్ల దూరం భక్తుల దర్శనార్థం ఊరేగించారు. స్వామివార్లను భక్తులు దర్శించుకొని కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement