విజయవంతంగా ప్రత్యేక పల్స్‌పోలియో | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా ప్రత్యేక పల్స్‌పోలియో

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

● చెంగల్పట్టు సహా 6 జిల్లాల్లో నిర్వహణ ● 9.16 లక్షల మంది చిన్నారులకు చుక్కలు

సాక్షి, చైన్నె: పొరుగు దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా తమిళనాడులోని చెంగల్పట్టు సహా 6 జిల్లాల్లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పోలియో చుక్కల శిబిరాలు నిర్వహించారు. భారత పోలియో వైరస్‌ నిపుణుల సలహా బృందం సూచనల మేరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో భాగంగా తమిళనాడులో ఆరు జిల్లాలో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెంగల్పట్టు, మైలాడుతురై, తంజావూరు, శివగంగ, తిరునెల్వేలి మరియు విరుదునగర్‌ జిల్లాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేశారు. ఈ ఆరు జిల్లాల్లోని 5 సంవత్సరాల లోపు వయస్సు గల సుమారు 9.16 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఆసుపత్రులు, పాఠశాలలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, మసీదులు, టోల్‌ ప్లాజాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి చుక్కలు వేశారు. చెంగల్పట్టు జిల్లాలోని పల్లవరం, తాంబరం, క్రోమ్‌పేట్‌, పమ్మల్‌, గూడువాంచేరి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. తాంబరంలో పల్స్‌ పొలియో కార్యక్రమాన్ని మంత్రి శరత్‌కుమార్‌ ప్రారంభించి పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement