అభిమానులకు ధన్యవాదాలు | - | Sakshi
Sakshi News home page

అభిమానులకు ధన్యవాదాలు

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

తమిళసినిమా: ప్రముఖుల వారసులు సినీ రంగ ప్రదేశం చేయ డం అన్నది కొత్త ఏమీ కాదు. ఇప్పటికే పలువురు వారసు లు ఈ రంగంలో అగ్రస్థానంలో రాణిస్తున్నారు. కాగా తాజాగా సీనియర్‌ సంగీత దర్శకుడు భరణి వారసుడు తిరువాసక్కన్‌ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. రామ్‌ సేవా కథ, కథనం, మాట లు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తు న్న ఈ చిత్రాన్ని స్టైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర షూటింగ్‌ ఇటీవల స్థానిక పోరూర్‌ లోని ఓం శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది ఒక యువకుడి జీవితంతో పాటు సమాజంలో జరిగే ఒక అంతుచిక్కని మర్మం నేపథ్యంలో సాగే కథ చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. ప్రేమ, కుటుంబ అనుబంధాల మధ్యసాగే పలు మలుపులో ఉత్కంఠ అంశాలతో కూడిన ఎమోషనల్‌ , సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఇందులో డాక్టర్‌ శరవణన్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నారని, నటి సినామిక కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో పలువురు ప్రతిభావంతులై న నూతన నటీనటులు నటిస్తున్నారని చెప్పా రు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్త షూటింగును చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. కాగా ఇంతకు ముందు పలు విజయవంతం చిత్రాలకు సంగీతాన్ని అందించిన భరణి ఈ చిత్రాని కి సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు.

తమిళసినిమా: వరుస విజయాలతో జోరు మీద ఉన్న నటుడు సూర్య. ఈయన ఇంతకుముందు నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ చిత్రం కూడా సూపర్‌ హిట్‌ అయింది. కాగా తాజాగా సూర్య కథానాయకుడిగా నటించిన సీన్‌ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన సీన్‌ చిత్రంలో మలయాళ నటి నజ్రియా నాయకిగా నటించారు. సూర్య పోలీస్‌ అధికారిగా వైవిధ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య జ్యోతిక లకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ, ళగరం స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మించాయి. సుషిన్‌ శ్యామ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుని మంచి పశువులను సాధిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూల్‌ సాధించినట్లు యూనిట్‌ వర్గాలు అధికారికంగా నిర్వహించారు తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లకుపైగా వసూలు సాధించినట్లు పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సూర్య తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియోనం విడుదల చేశారు . అందులో ప్రియమైన ఫ్యాన్స్‌ తమ్ముళ్లు, చెల్లెళ్లు, తమిళ సినిమా అభిమానులు అందరికీ ధన్యవాదాలు. సీన్‌ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆనందించి, పరిశోధించి డి కోడ్‌ చేసి ఘనవిజయాన్ని అందించారు. ఒక చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడితే అందులో నటించేవారు చిత్రాన్ని నిర్మించిన వారు చిత్రానికి సంబంధించిన వారు సంతోషపడతారు అయితే మాకంటే మీరు అధికంగా సంతోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన మీకు ఎలా కతజ్ఞతలు చెప్పు కోవా లో తెలి యడం లేదు. హదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏడాదిని చాలా ప్రత్యేకంగా మార్చి నందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. మళ్లీ మంచి చిత్రంతో మిమ్మల్ని కలుసుకుంటాను అని నటుడు సూర్య ఆ వీడియోలో పేర్కొన్నారు.

నటుడు సూర్య

‘తమిళిని’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

తమిళసినిమా: మానవ సంబంధాలు, కుటుంబ అను బంధాలు, ప్రత్యేక త్యాగాలు, భావోద్రేకాలు వంటి అంశాలతో ప్రూఫ్‌ ఉంది చిత్రాలకు భాష , హద్దులను దాటి అభిమానుల ఆదరణ లభిస్తుంది అలాంటి కథాంతయంతో మత్స్యకార సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం తమిళిని. టీపీ. శరవణన్‌, విజిల శరవణన్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గణేష్‌ మూర్తి కథలను నిర్వహిస్తున్నారు. సన్‌ టీవీ యాంకర్‌ ,యూట్యూబర్‌ అయినా డీజే ఆశిక్‌, ప్రదీప్‌ రాజ్‌ హీరోలుగా నటిస్తున్న ఇందులో ఎన్న విలై చిత్రం ఫేమ్‌ షాషా శివకుమార్‌, పుష్పలత హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి దీపా శంకర్‌, బెంజిమెన్‌ , విన్సెంట్‌ రాయ్‌, టీపీ. చరవణన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ టీవీ సూపర్‌ సింగర్‌ ఫేమ్‌ సంతోష్‌ బాలాజీ సంగీతాన్ని, విజయ్‌ వెంకట్‌,శరణ్యాగణేష్‌ లో ద్వయం ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ. చిత్ర షూటింగ్‌ ను తమిళనాడులోని దక్షిణ సముద్ర తీర ప్రాంతాలు ముట్టుం,ఉవరి,కట్టియపట్టిణం, కులచల్‌ దిసైయన్‌ విళై, కూట్టప్పనై, పెరియతాళై,మణపాట్టు ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించి 24 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు.ప్రస్తుతం నిర్మాత కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ప్రేమ ,అనుబంధాలు, కుటుంబాల్లో చేయి దాటిన పరిస్థితుల కారణంగా జీవితం ఎలా మారుతుంది అని చెప్పే కథాచిత్రంగా ఇది ఉంటుందన్నారు. మన సంతోషాన్ని దాటి మనకు సంబంధించిన వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలతో ఏర్పడే పరిణామాలను ఉద్రేగభరితంగా తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. ఇది మత్స్యకారుల నేపథ్యంలో సాగే కథా చిత్రమైనా, ఇందులో చెప్పే విషయాలు అందరికీ చెందేలా ఉంటాయన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ను విడుదల చేసినట్లు, చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement