నిర్వాహకులకు సోషల్‌ మీడియా ఖాతాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

నిర్వాహకులకు సోషల్‌ మీడియా ఖాతాలు తప్పనిసరి

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

● పుదుచ్చేరి డీఎంకే సమావేశంలో కీలక తీర్మానం

సాక్షి, చైన్నె: పార్టీ కార్యకలాపాలను, ప్రజా సమస్యలను మరింత విస్త్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వాహకులందరూ తప్పనిసరిగా సోషల్‌ మీడి యా ఖాతాలను తెరిచి, నిర్వహించాలని పుదుచ్చేరి డీఎంకే యువజన విభాగం సమావేశంలో కీలక తీర్మానం చేశారు.పుదుచ్చేరి రాష్ట్ర డీఎంకే ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీఎంకే ఆర్గనైజర్‌ శివ సమక్షంలో యువజన విభాగం సంప్రదింపుల సమావేశం జరిగింది. రాష్ట్ర యువజన విభాగం ఆర్గనైజర్‌ సంపత్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో రాష్ట్ర యువజన విభాగం డిప్యూటీ ఆర్గనైజర్లు, నియోజకవర్గ ఆర్గనైజర్లు, డిప్యూటీ ఆర్గనైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం విస్తృతం చేస్తూ, యువజన విభాగంలోని ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా ఖాతాలను ప్రారంభించి, వాటి ద్వారా చురుగ్గా వ్యవహరించాలి. పుదుచ్చేరిలోని అధికార పార్టీ పరిపాలనా వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు వివరించేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement