చైన్నెకి అవార్డు.. | - | Sakshi
Sakshi News home page

చైన్నెకి అవార్డు..

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

కొత్త ఆస్పత్రి భవనాలకు

ప్రారంభోత్సవం

చైన్నె విమాశ్రయం నుంచి

గ్రీన్‌కారిడార్‌కు శంకుస్థాపన

తేనాంపేట జోన్‌ ఖాదర్‌ నవాజ్‌ ఖాన్‌ రోడ్డులో పాదచారుల నడక మార్గాలు, రోడ్డు భద్రతా చర్యలతో చేపట్టిన పనులకు గాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అందుకున్న బెస్ట్‌ నాన్‌–మోటరైజ్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిటీ అవార్డును అధికారులు సీఎంకు చూపి ఆశీస్సులు తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్‌ 2025–26 వేడుకల్లో కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద తమిళనాడులోని తొలి క్లీన్‌ సిటీగా ఎంపికై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న అవార్డును తేని అళ్లినగరం మునిసిపల్‌ అధికారులు సీఎంకు చూపి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటి సరఫరా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ ,వాటర్‌ బోర్డు ఎంపీ ఆనంద్‌ , మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి , చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ జి.ఎస్‌. సమీరన్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చైన్నెలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ మౌలిక సదుపాయాలు, సేవల విస్తృతం దిశగా సీఎం విజయ్‌ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వైద్యం, ప్రజా సంక్షేమ శాఖ తరఫున రూ. 210.14 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ఆసుపత్రి భవనాలు, క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తిరుక్కోయిలూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ప్రధాన ఆసుపత్రిగా ఉన్నతీకరించడంతో పాటు, పలు ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్త వసతులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కళ్లకురిచ్చి జిల్లా ప్రధాన ఆసుపత్రిగా ఉన్నతీకరించి రూ. 59.04 కోట్లతో కొత్త భవనాలు, వైద్య పరికరాలను ప్రారంభించారు. రూ. 54 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ కలిసి 6 అంతస్తులతో రెండు బ్లాక్‌లు నిర్మించి, పడకల సంఖ్యను 134 నుంచి 300కు పెంచారు. రూ. 5.04 కోట్లతో వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే,కరూర్‌ జిల్లా పళ్లపట్టిలో రూ. 6.37 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ తో పాటుగా 3 అంతస్తుల అదనపు భవనాన్ని ప్రారంభించి, పడకల సామర్థ్యాన్ని 50 నుంచి 80కి పెంచారు. ఈరోడ్‌ జిల్లా సత్యమంగళంలో మెటర్నిటీ, నవజాత శిశు సంరక్షణ విభాగం కోసం రూ. 6.18 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటుగా మొదటి అంతస్తు భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ యాంటీనేటల్‌ ఓపీడీ, స్కాన్‌ రూమ్‌, మెటర్నిటీ ఎమర్జెన్సీ, రెండు లేబర్‌ రూమ్‌లు, మదర్‌ కేర్‌ రూమ్‌లు, డికంటమినేషన్‌ ఏరియా, రెండు ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఈరోడ్‌ జిల్లా గౌండంపాళయంలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన అదనపు భవనాన్ని ఈరోడ్‌, సేలం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులు , పరమత్తివేలూరు, శ్రీపెరంబుదూర్‌, అరక్కోణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 135 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాయికుమార్‌ , వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ తారేస్‌ అహ్మద్‌ , నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనీష్‌ శేఖర్‌ , తమిళనాడు హెల్త్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. ఉమా తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ కారిడార్‌కు శంకుస్థాపన..

గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ , మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌, చైన్నె మెట్రో వాటర్‌ ఆధ్వర్యంలో రూ. 174.97 కోట్ల వ్యయంతో పూర్తయిన 12 ప్రాజెక్టులను సి. జోసెఫ్‌ విజయ్‌ ప్రజల ఉపయోగానికి తీసుకొచ్చారు. అలాగే, చైన్నె విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద రూ. 11.15 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించిన 2 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో మనాలి జోన్‌లో కడపాక్కం చెరువు పునరుద్ధరణ, తిరు.వి.క. జోన్‌ పులియాంతోపు వద్ద వేస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (, మనాలి జోన్‌ మాత్తూరు ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ స్పాంజ్‌ పార్క్‌ , మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌ మదురై కార్పొరేషన్‌ మాట్టుత్తావణి వెజిటబుల్‌ మార్కెట్‌ వద్ద ఆనియన్‌ మార్కెట్‌ , విరుదాచలం మున్సిపాలిటీలో ఆధునిక కూరగాయల మార్కెట్‌ ,పొలాచ్చిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను పారంభించారు. చైన్నె మెట్రో వాటర్‌ – అమెజాన్‌ లు కోట్టూరుపురంలో ఏర్పాటు చేసిన రోజుకు 1 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు శంకు స్థాపన చేశారు. అలాగే, చైన్నె విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద పార్క్‌, అలాగే గిండి – కత్తిపార నుంచి విమానాశ్రయ ప్రవేశ ద్వారం వరకు 5.30 కి.మీ. పొడవున గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన.. రేపు

సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ శుక్రవారం తిరుచ్చిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 110 కోట్ల వ్యయంతో నిర్మించిన తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాన్ని ప్రారంభించడంతో పాటు, 8 కిలోమీటర్ల మేర నిర్వహించే భారీ రోడ్‌ షోలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.విమానాశ్రయం నుంచి వైర్‌లెస్‌ రోడ్‌, కె.కె. నగర్‌, కాజమలై, రేస్‌ కోర్స్‌ రోడ్‌, తమిళనాడు హోటల్‌, సుబ్రహ్మణ్యపురం, టీవీఎస్‌ టోల్‌గేట్‌, గూడ్స్‌షెడ్‌ ఫ్లైఓవర్‌, హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, కంటోన్మెంట్‌, భారతిదాసన్‌ రోడ్డు మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేలా మార్గాన్ని పరిశీలిస్తున్నారు. తిరుగు ప్రయాణంలోనూ విమానాశ్రయం వరకు రోడ్‌ షోకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి.

విస్తృతంగా సేవలకు సీఎం విజయ్‌ చర్యలు

ఉన్నత విద్యకు పెద్ద పీట

అనంతరం ఉన్నత విద్యకు పెద్ద పీట వేస్తూ జరిగిన నిర్మాణాలను సీఎం విజయ్‌ ప్రారంభించారు. ఉన్నత విద్యా శాఖ తరఫున రూ. 52.01 కోట్లతో నిర్మించిన పలు అకడమిక్‌ భవనాలను , చెంగల్పట్టు జిల్లా ఆలందూరులో రూ. 22.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కొత్త ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. కోయంబత్తూరు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలకు అదనపు హాస్టల్‌ భవనం, తిరుప్పూర్‌ ఎల్‌.ఆర్‌.జి. ప్రభుత్వ మహిళా ఆర్ట్స్‌ కళ శాలకు 8 అదనపు తరగతి గదులు, 12 ల్యాబ్‌లు, మల్టీపర్పస్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, కాంక్రీట్‌ రోడ్డు, క్రీడా మైదానం, తాగునీటి సౌకర్యాలు, తంజావూరు మన్నార్‌ సర్ఫోజీ ప్రభుత్వ కళాశాలలోఇండోర్‌ స్టేడియంను ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి విశ్వనాథన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్‌ (ఐఅ ), ఉన్నత విద్యా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్‌ కుమార్‌, సాంకేతిక విద్యా డైరెక్టర్‌ రత్న స్వామిన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement