రాహుల్‌తో మాట్లాడేందుకు స్టాలిన్‌ నిరాకరణ.. | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌తో మాట్లాడేందుకు స్టాలిన్‌ నిరాకరణ..

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

● తమిళనాడు రాజకీయాల్లో చర్చ ● సోనియాగాంధీ ఫోన్‌ చేయలేదన్న స్టాలిన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల మధ్య దూరం మరింత పెరిగినట్లయ్యింది. ఢిల్లీలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ ఆహ్వానించేందుకు ప్రయత్నించగా, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ ఆయనతో ఫోన్‌లో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తాజాగా తెలిసింది. వివరాలు.. గతంలో బహిరంగ వేదికలపై ఒకరినొకరు తాము సోదరులం అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న స్టాలిన్‌, రాహుల్‌ గాంధీల మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం సమయంలోనే విభేదాలు తలెత్తాయని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో స్టాలిన్‌ సుమారు 5 సార్లు ఫోన్‌ చేసినా రాహుల్‌ స్పందించలేదని సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగ ఎన్నికల ప్రచారంలోనూ ఇరువురు నేతలు ఒకే వేదికపై రాలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత, దశాబ్దాల పాటు డీఎంకేతో ఉన్న పొత్తును కాంగ్రెస్‌ ఆకస్మికంగా వీడి ఆ పార్టీకి మద్దతు ప్రకటించింది. సీఎం విజయ్‌ మంత్రివర్గంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా కూడా చేరింది. ఈ పరిణామం స్టాలిన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇండియా కూటమి నుంచి సైతం డీఎంకే బయటకు వచ్చింది. ఈ పరిస్థితులలో ఆరు నెలల తర్వాత రాహుల్‌ గాంధీ చొరవ చూపి మాట్లాడేందుకు ప్రయత్నించినా స్టాలిన్‌ నిరాకరించడం గమనార్హం.

ఫోన్‌ ఆహ్వానానికి స్టాలిన్‌ దూరం

ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో సోనియా గాంధీ రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఆహ్వానించేందుకు రాహుల్‌ గాంధీ కార్యాలయం స్టాలిన్‌ కార్యాలయాన్ని సంప్రదించిందని, అయితే తాను ఇతర ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నానని చెబుతూ స్టాలిన్‌ ఫోన్‌లో మాట్లాడకుండా దాట వేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో సోనియా గాంధీ పుస్తకం విజయవంతం కావాలని స్టాలిన్‌ కేవలం ఒక అభినందన సందేశాన్ని మాత్రమే పంపినట్లు సమాచారం.ఈ వేడుకుక సీఎం విజయ్‌ హాజరైన సమయంలోనే స్టాలిన్‌ ఆహ్వానాన్ని తిరస్కరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం గురించి బుధవారం స్టాలిన్‌ను మీడియా కదిలించగా, పుస్తకావిష్కరణ కార్యమ్రానికి సోనియా గాంధి తనను ఆహ్వానించ లేదన్నారు. ఆమె తన సహాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారని, తాను కూడా ఆసహాయకుల ద్వారానే సోనియా గాంధికి అభినందనలు తెలిపినట్టు వ్యాఖ్యల తూటాలను పేల్చడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement