తిరువళ్లూరు: సహకారశాఖ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులు, రెండు స్వయం ఉపాధి సంఘాలకు రూ.50.39 లక్షల రుణాలను జాయింట్ రిజిస్ట్రార్ జయశ్రీ నేతృత్వంలోని అధికారులు అందజేశారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రుణాలను పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ముఖ్యఅతిథిగా జాయింట్ రిజిస్టర్ జయశ్రీ హాజరై రుణాలను పంపిణి చేశారు. గ్రామీణ పరిశ్రమల రుణ పఽథకం కింద ఏడు మంది లబ్ధిదారులకు 3.50 లక్షలు, సింగిల్ మహిళల రుణ పథకం కింద ఇద్దరు లబ్దిదారులకు 75 వేలు, స్వయం ఉపాధి సంఘాలకు 40 లక్షలు, మద్యకాలిక రుణ పథకం కింద 4 లబ్దిదారులకు 3.64 లక్షలతో సహా మొత్తం 50.39 లక్షల ఆర్థిక సాయాన్ని జాయింట్ రిజిస్టర్ జయశ్రీ అందజేశారు. రుణాలు పొందిన లబ్ధిదారులు సరిగ్గా తిరిగి చెల్లించాలని, పొదుపు స్థాయిని సైతం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్లు అముధ(తిరుత్తణి) పాల్గొన్నారు.


