6 నెలల పాలన ఆశించిన స్థాయిలో లేదు | - | Sakshi
Sakshi News home page

6 నెలల పాలన ఆశించిన స్థాయిలో లేదు

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్‌

సాక్షి, చైన్నె : తమిళనాడులోని టీవీకే ప్రభుత్వ ఆరు నెలల పాలన ప్రజలు ఆశించిన దిశలో సాగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్‌ విమర్శించారు. బుధవారం తిరుచ్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలల అనుభవం నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని వీరపాండియన్‌ సూచించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ధరల పెరుగుదల, శాంతిభద్రతల సమస్యలపై సీఎం మౌనం వీడి బహిరంగంగా మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. రైతులు, ఉపాధ్యాయుల నిరసనల సందర్భంగా నమోదైన కేసులను ఉపసంహరించుకోవడాన్ని సీపీఐ స్వాగతిస్తోందని తెలిపారు. అయితే తిరుచ్చి సహా రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలన్నారు. తిరుచ్చి నగర పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఇంటెలిజెన్స్‌ విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టును వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసి ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నివారించాలని కోరారు. మేఘదాతు వద్ద ఆనకట్ట నిర్మించి తీరుతామంటూ కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నదుల అనుసంధానం చేపట్టాలని కోరారు. ఢిల్లీలో ఉన్న ముగ్గురు తమిళనాడు మంత్రులు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టాలని సూచించారు.

సుప్రీంకోర్టు బెంచ్‌

తమిళనాడులో సుప్రీంకోర్టు ప్రాంతీయ శాఖను ఏర్పా టు చేయాలని వీరపాండియన్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రతినిధులు లేదా పార్టీ నేతలు తప్పులు చేస్తే ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ఎంపీ వెంకటేశన్‌పై మదురై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఆర్‌. స్వామినాథన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణతో పాటు రైతులు, కార్మికులు, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా మార్పు అవసరం అనే నినాదంతో డిసెంబర్‌ 1, 2, 3 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement