తప్పుడు నిర్ణయాలతో గుణపాఠం | - | Sakshi
Sakshi News home page

తప్పుడు నిర్ణయాలతో గుణపాఠం

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

తమిళసినిమా: జీవితంలో తప్పులు చేయని వారు ఉండరు అయితే చేసిన తప్పులు తెలుసుకుంటే జీవితంలో ఎదగవచ్చు. నటి శ్రీ లీల అలాంటి గుణపాఠాన్ని నేర్చుకున్నారని చెప్పారు. అతి చిన్న వయసులోనే కథానాయకగా పరిచయమై ఉన్నత స్థానాన్ని అధిష్టించిన నటి ఈ బ్యూటీ. తెలుగులో నటించిన తొలి చిత్రం పెళ్లి సందడి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిన్న గ్యాప్‌ వచ్చిన ధమాకా చిత్రం స్టార్‌ హీరోయిన్‌ ని చేసింది. అలా 23 ఏళ్ల వయసులోనే కేజీ కథానాయకల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో ఒకే ఒక్క చిత్రం ఉంది. కాగా పరాశక్తి చిత్రంతో తమిళ్‌ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకు ముందే పుష్ప 2 చిత్రంలో నటించిన కిసక్కు అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌ తో తమళ్‌ ప్రేక్షకులను ఆలరించారు. కాగా పరాశక్తి చిత్రంలో సీ్త్ర లీల నటనకు మంచి మార్కులు పడిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని చేరుకోలేదు . అయినా ఇక్కడ ఈ బ్యూటీకి అవకాశాలు వరుసగడుతున్నాయి. ఈమె నటుడు ధనుష్‌ జంటగా నటించిన ఓం చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం తెరపైకి రానుంది. ఇందులో నటుడు ధనుష్‌ కు చిన్ననాటి స్నేహితురాలుగా ఆ తర్వాత భార్య అయ్యే పాత్రను పోషించినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంపై శ్రీ లీల చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పాలి. కాగా నటుడు రజినీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ధర్మన్‌ చిత్రంలోని శ్రీ లీల ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అజిత్‌ సరసన డేర్‌ డెవిల్‌ చిత్రంలోను నటిస్తున్నారు. అదేవిధంగా హిందీలో కార్తీక్‌ ఆర్యకు జంటగా నటిస్తున్నారు. ఇది ఈమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా అనురాగ్‌ బస్సు దర్శకత్వంలో మన చిత్రం కమిట్‌ అయ్యారని సమాచారం. కాగా ఇటీవల ఈమె ఒక బెట్టిలో పేర్కొంటూ కెరీర్‌ ప్రారంభంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు , వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం వల్ల చాలా మూల్యం చెల్లించాలని, ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్లే చాలా గుణపాఠం నేర్చుకున్నట్లు నటి శ్రీలీల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement