తనిష్క్‌ దోపిడీలో కేసులో.. | - | Sakshi
Sakshi News home page

తనిష్క్‌ దోపిడీలో కేసులో..

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

● నిందితుడు నిశాంత్‌ అరెస్టు ● ధర్మపురి సమీపంలో పట్టుకున్న పోలీసులు

సాక్షి, చైన్నె: మదురైలోని ప్రముఖ నగల దుకాణం తనిష్క్‌లో ఇటీవల జరిగిన కోట్లాది రూపాయల విలువైన ఆభరణాల దోపిడీ కేసులో పోలీసులు ఎట్టకేలకు ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. పరారీలో ఉన్న ఇన్‌స్ట్రాగామ్‌ సెలబ్రిటీ నిశాంత్‌ (23) ఓమ్ని బస్సులో ప్రయాణిస్తుండగా, ధర్మపురి జిల్లా అధియమాన్‌ కోట్టై పోలీసులు చాకచక్యంగా చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు. చోరీ అనంతరం నిశాంత్‌ పరారీలో ఉండటంతో సేలం, ధర్మపురి, హోసూర్‌, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో నిశాంత్‌ బెంగళూరు నుండి సేలంకు ఓమ్ని బస్సులో ప్రయాణిస్తుండగా, అతని అనుమానాస్పద కదలికలను గమనించిన బస్సు డ్రైవర్‌ వెంటనే అధియమాన్‌ కోట్టై పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ధర్మపురి జిల్లా శేషంపట్టి బైపాస్‌ వద్ద బస్సును అడ్డుకున్నారు. పోలీసులను చూడగానే నిశాంత్‌ బస్సు కిటికీలోంచి దూకి పారిపోయేందుకు యత్నించాడు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న మదురై ప్రత్యేక పోలీసు బృందం నిశాంత్‌ను మదురైకి తరలించి విచారించేందుకు ధర్మపురికి బయలుదేరింది.

స్నేహితురాలి కోసమే దోపిడీ

మదురై బైపాస్‌ రోడ్డులోని తనిష్క్‌ నగల దుకాణంలో జరిగిన భారీ చోరీ వెనుక వీకేబీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌ కుమారుడు నిశాంత్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన ఇన్‌స్ట్రాగామ్‌ స్నేహితురా లు మీనాక్షి (తిరుప్పాలై) అవసరాలు తీర్చడం కోసమే నిశాంత్‌ ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. దోపిడీకి ముందు, తర్వాత నిశాంత్‌ తన స్నేహితురాలు మీనాక్షితో ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడినట్లు కాల్‌ డేటాద్వారా పోలీసులు గుర్తించారు. చోరీ కి ఉపయోగించిన ద్విచక్ర వాహనం కూడా మీనాక్షిదేనని తేలింది. దొంగిలించిన నగలను నిశాంత్‌ తన తండ్రి సురేష్‌కు, మీనాక్షికి అప్పగించాడు. నిశాంత్‌ తండ్రి సురేష్‌, స్నేహితురాలు మీనాక్షిలను పోలీసులు మొన్ననే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మీనాక్షి ఇచ్చిన సమాచారంతో కొండ దిగువన పొదల్లో దాచి ఉంచిన 15 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.ఈ దోపిడీ వెనుక మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు నిశాంత్‌ పట్టుబడటంతో, మిగిలిన నగలను రికవరీ చేయడంతో పాటు ఈ కేసులోని మరిన్ని కీలక విషయాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement