ఈ–రిజిస్ట్రేషన్‌ విధానాన్ని రద్దు చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఈ–రిజిస్ట్రేషన్‌ విధానాన్ని రద్దు చేయాలని ధర్నా

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

తిరువళ్లూరు: రిజిస్ట్రేషన్‌ విభాగంలో నూతనంగా తీసుకొచ్చిన ఈ– రిజిస్ట్రేషన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ డాక్యుమెంట్‌ రైటర్‌లు తమ విధులను బహిస్కరించి నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ– విధానం ద్వారా రిజిస్ట్రేషన్‌ల విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా నూతన విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని ఆరోపిస్తూ గత మూడు రోజుల క్రితం విధులను బహిష్కరించి డాక్యుమెంట్‌ రైటర్‌లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిస్కరించని పక్షంలో ఆందోళననూ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్‌ల సమస్యలను పరిస్కరించలేదు. దీంతో రెండవదశ ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే నల్లబ్యాడ్జీలు ధరించిన డాక్యుమెంట్‌ రైటర్‌లు మంగళవారం ఉదయం తిరువళ్లూరు సబ్‌రిజిస్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సంఘం నేతలు సంపత్‌రాజ్‌, శ్రీనివాసన్‌, మౌలానయాసిన్‌, శశికళ, హేమకుమార్‌, పార్థీబన్‌, నరేంద్రన్‌, ఉధయకుమార్‌, విమల, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement