కాట్పాడిలో ఆస్తి తగాదా | - | Sakshi
Sakshi News home page

కాట్పాడిలో ఆస్తి తగాదా

Nov 25 2026 12:38 AM | Updated on Nov 25 2026 12:38 AM

– యువకుడి హత్య

వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని ఎల్‌జీ పుదూ రు గ్రామానికి చెందిన పెరుమాల్‌ ఇతని బార్య పొన్నియమ్మాల్‌ దంపతుల కుమారులు దినగరన్‌(25) పెరుమాల్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. అన్నదమ్ముల మద్య తరచూ ఆస్తి తగాదా ఉండేది. దినగరన్‌ వ్యవసాయ పనిలో ఉన్నప్పుడు అతి కుడి చెయ్యి పోగొట్టుకోవడంతో అతనికి కుటుంబ సభ్యు లు అధికంగా ఆస్తిని పంచి ఇచ్చినట్లు తెలుస్తుంది. తరచూ ఘర్షలు రావడంతో పొన్నియమ్మా ల్‌ తన భర్తకు దూరంగా ఉం టూ చిన్న కుమా రుడితో కలిసి జీవిస్తుంది. పెద్ద కుమారుడు దినగరన్‌తో కలిసి తండ్రి పెరుమాల్‌ జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దినగరన్‌ను అతి దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి వెల్లి పోయారు. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు విరుదంబట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీటిపై విచారణ చేస్తున్నారు. అన్నదమ్ముల మద్య ఆస్తి తగాదా ఉండటంతోనే హత్యకు పూను కున్నారా లేక వేరే ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement