తిరుత్తణి: కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరుత్తణి కొండకు సమీపంలోని పచ్చిబియ్యం కొండపై 150 కేజీల నెయ్యి మహా దీపం వెలిగించారు. కొండపై ఉన్న తాటిచెట్టుపై అశేష భక్తజనం నడుమ దీపం వెలిగించగా, భక్తులు హారంహర నామస్మరణతో దీప దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి విశేష అభిషేక పూజలు చేసారు. రుద్రాక్ష మండపంలో ఉత్సవర్లకు పుష్పాలతో అలంకరణ చేపట్టారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్య లో భక్తులు కొండకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో కొండ ఆలయంకు ఎదురుగా వున్న పచ్చిబియ్యం కొండపై 150 కేజీల నెయ్యితో మహాదీపం వెలిగించగా, కొండ ఆలయ మాడ వీధిలో ఉత్సవర్లు వెండి నెమలి వహనంలో కొలువుదీరగా, సిద్ధంగా వుంచిన తాటిచెట్టు దూలంపై నెయ్యి దీపం వెలిగించగా వేలాది మంది భక్తులు దీప దర్శనం చేసుకున్నారు.
పచ్చిబియ్యం కొండపై
మహాదీపం వెలిగించిన
దృశ్యం


