సహకార గృహ రుణ బకాయిదారులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

సహకార గృహ రుణ బకాయిదారులకు ఊరట

Nov 25 2026 12:38 AM | Updated on Nov 25 2026 12:38 AM

●l Ð]lÑ-ి òÜsìæ-ÌŒæ-Ððl$…sŒæ ç³£ýlMýS… మార్గదర్శకాలు విడుదల ● జరిమాన వడ్డీ, ఈఎంఐ వడ్డీ మాఫీ..

సాక్షి,చైన్నె: సహకార గృహ నిర్మాణ సంఘాల ద్వారా గృహ రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించడంలో బకాయిపడిన వారికి తమిళనాడు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఒకేసారి రుణ పరిష్కార పథకం) అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు. రుణగ్రహీతలపై వడ్డీ భారాన్ని తగ్గించి, ప్రాథమిక సంఘాల స్థాయిలో దీర్ఘకాలిక బకాయిలను వసూలు చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మార్చి 31వ తేదీలోగా వాయిదాలు చెల్లించడంలో విఫలమైన సభ్యుల తనఖా రుణాలు, స్థిర రుణాలు ఇతర రుణాలపై జరిమానా వడ్డీ, డిగ్రీ వడ్డీ, ఈఎంఐ వడ్డీని మాఫీ చేయనున్నారు. అల్ప మరియు మధ్య ఆదాయ వర్గాల రుణగ్రహీతలకు అదనంగా 1 శాతం వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమలు షరతులు, గడువు..

ప్రాథమిక సహకార గృహ నిర్మాణ సంఘాల నుంచి రుణం తీసుకుని సభ్యులకు జారీ చేసిన తనఖా, స్థిర రుణాలకు మాత్రమే ఈ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. మార్చి 31 నాటికి గడువు ముగిసి బకాయి ఉన్న తనఖా రుణాలు ఈ పథకానికి అర్హత పొందుతాయి.పరిష్కార తేదీ నాటికి సభ్యులు చెల్లించాల్సిన అసలు, వడ్డీ బకాయి మొత్తాన్ని ఒకే విడతలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ఈ పథకం అమలులో ఉంటుందని, ఆ తర్వాత గడువు ముగుస్తుందని గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement