కోలీవుడ్‌లో కిసిక్కు | - | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో కిసిక్కు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

తమిళసినిమా: ఏ నటి ఎప్పుడు ఏ భాషలో అందలం ఎక్కుతుందో ఎవరూ ఊహించలేదు. ఈ విషయాన్ని బహుశా ఆ నటీమణులు కూడా ఊహించలేరు. అలాంటి నటీమణుల్లో శ్రీలీల ఒకరిని కచ్చితంగా చెప్పవచ్చు. తెలుగు, కన్నడం, హిందీ, తమిళం అంటూ పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న క్రేజీ కథానాయకి ఈ బ్యూటీ. ఆదిలో తెలుగులో రెండు చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకున్నా ఆ తర్వాత అవకాశాలు రావడానికి కొంచెం సమయం పట్టింది. ఆ తర్వాత వచ్చిన ధమాకా తెలుగు చిత్రం క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఆపై వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లో క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కోలీవుడ్‌ శ్రీలీల మూడు చిత్రాల్లో నటిస్తున్న నటిస్తుండడం విశేషం. అవన్నీ భారీ చిత్రాలు కావడం మరో విశేషం. ఇక్కడ మొదట్లో పుష్పా 2 చిత్రంలో కిసిక్కు అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి కురక్రారును గిలిగింతలు పెట్టించిన శ్రీలీల ఆ తర్వాత పరాశక్తి చిత్రంతో కథానాయికిగా పరిచయమై తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా నటుడు ధనుష్‌కు జంటగా ఓం చిత్రం, రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ధర్మన్‌ చిత్రంతో పాటు అజిత్‌కు జంటగా డేర్‌ డెవిల్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇలా ఒకేసారి మూడు తమిళ చిత్రాల్లో నటిస్తూ తమిళ ప్రేక్షకులను కిసిక్కు కనిపించబోతున్నారు. అదే విధంగా హిందీలోనూ రెండు చిత్రాల్లో నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయికిగా పేరు తెచ్చుకున్నారు. త్వరలో నటిగా దశకం లోకి అడుగు పెడుతున్న ఈ 25 ఏళ్ల బ్యూటీ పయనం ఆశ్చర్య పరుస్తోంది.

తమిళసినిమా: సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. నటీనటులు, సాంకేతిక వర్గంతో పాటు నిర్మాతలు కూడా భాషా భేదం లేకుండా చిత్ర నిర్మాణం చేస్తున్నారు. అలా బాహుబలి చిత్రాన్ని నిర్మించిన అర్కా మీడియా సంస్థ ఇప్పుడు కోలీవుడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఈ సంస్థ అధినేతలు శోభ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తమిళంలో నిర్మిస్తున్న తొలి చిత్రం జాన్‌ డో. నటుడు అర్జున్‌దాస్‌ హీరోగా నటించిన ఇందులో మధుమిత కథ, దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. నటి సంజనా నటరాజన్‌ నాయకి. సృష్టి, జారా వినీత్‌ సందోక్‌ నీరవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కృతి జయరామన్‌ ఛాయాగ్రహణంను, మజీద్‌ ముజీబ్‌ సంగీతాన్ని, ఆర్టిస్ట్‌ 4 0 4 సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 13న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకురాలు మధుమిత మాట్లాడుతూ తాను ఈ తరహా నేపథ్యంలో చిత్రాలను రూపొందించినా, భావోద్వేగాలు ముఖ్యంగా ఉంటాయన్నారు. జాన్‌డో ఒక సైకిలాజికల్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కేరళ తమిళనాడు సరిహద్దుల్లో గల కురింజిమేడు అనే కొండ ప్రదేశంలో విచిత్ర కథ నడుస్తుందని చెప్పారు చిత్ర షూటింగ్‌లో అడుగడుగు నా నిర్మాతల సహకా రం తనకు ప్రోత్సాహంగా ఉందని పేర్కొన్నారు. నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌ దేవినేని మాట్లాడుతూ తాము నిర్మిస్తు న్న తొలి తమిళ చిత్రం ఇదని చెప్పారు. దర్శకురాలు మధుమిత చెప్పిన కథ వినగానే నచ్చే సిందన్నారు. దీన్ని తెలుగులో నిర్మిద్దామా తమిళంలో నిర్మిద్దా మా లేక తమిళంలో చేద్దామా? అన్న సంశ యం ముందు ఏర్పడిందన్నారు. కథ నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చే యాలంటే తమిళంలోని బాగుంటుందని, అదే సమయంలో వ్యాపార పరంగాను లాభదాయకంగా ఉంటుందని భావించి తమిళంలో నిర్మించినట్లు చెప్పారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, దీన్ని ఏజీఎస్‌ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement