దక్షిణ రైల్వేలో జాతీయ ఐక్యతా దివస్‌ | - | Sakshi
Sakshi News home page

దక్షిణ రైల్వేలో జాతీయ ఐక్యతా దివస్‌

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వేలో జాతీయ ఐక్యత దివస్‌ (రాష్ట్రీయ ఏకతా దివస్‌) వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకుంటామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.చైన్నెలోని సదరన్‌ రైల్వే ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ విపిన్‌ కుమార్‌ అధికారులు, ఉద్యోగులచే ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా సదరన్‌ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌తో పాటు అన్ని డివిజన్లు, వర్క్‌షాప్‌లలో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతిజ్ఞా స్వీకరణలు, రన్‌ ఫర్‌ యూనిటీ ర్యాలీలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement