11 మంది పోలీసు అధికారులు ప్రశంసా పత్రాలు | - | Sakshi
Sakshi News home page

11 మంది పోలీసు అధికారులు ప్రశంసా పత్రాలు

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

సాక్షి, చైన్నె : చైన్నె నగర పోలీసు విభాగంలో సేవలందించిన అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కలైసెల్వం, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్ముడు రిజర్వు) వెంకట్‌రాజ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు దినకరన్‌, నందకుమార్‌, స్పెషల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రవిచంద్రన్‌, దురైమురుగన్‌, శ్రీనివాసన్‌, పద్మరాజ్‌, సెల్వం, గాంధీ, ఆర్ముడు రిజర్వు శానిటరీ వర్కర్‌ సుశీలతో కలిపి మొత్తం 11 మంది పోలీసు అధికారులు, సిబ్బంది శనివారం పదవీ విరమణ పొందుతున్నారు. వీరిని శుక్రవారం కమిషనర్‌ డాక్టర్‌ అమల్‌ రాజ్‌ సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. వెపేరిలోని పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని, వీడ్కోలు సభను నిర్వహించారు. 29 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు సుదీర్ఘకాలం పాటు విశేష సేవలందించి తమిళనాడు పోలీస్‌ శాఖకు, చైన్నె నగర పోలీసు విభాగానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఈ 11 మంది అధికారులు, సిబ్బంది సేవలను కొనియాడారు. వారి సేవలను ప్రశంసిస్తూ కమిషనర్‌ ఈ సందర్భంగా వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇన్ని సంవత్సరాలుగా పోలీస్‌ శాఖకు అందించిన సహకారానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పదవీ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కమిషనర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (అడ్మినిస్ట్రేషన్‌) ఎ.సుబ్బులక్ష్మి, సుందరవడివేల్‌ (వెల్ఫేర్‌ అండ్‌ ఎస్టేట్స్‌), పోలీస్‌ ఉన్నతాధికారులు రిటైర్‌ అవుతున్న సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement