రూ.200లకే 10 రకాల నిత్యావసర సరుకులు | - | Sakshi
Sakshi News home page

రూ.200లకే 10 రకాల నిత్యావసర సరుకులు

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన 10 రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక సరుకుల ప్యాకేజీ విక్రయాలను రూ.200లకే అందుబాటులోకి తెచ్చింది. చైన్నెలోని రెడ్‌హిల్స్‌లోని సహకార సూపర్‌ మార్కెట్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సహకార శాఖ మంత్రి గాంధీరాజ్‌ ఈ ప్రత్యేక సరుకుల ప్యాకేజీ విక్రయాలను ప్రారంభించి, తొలి 100 మంది లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. 128 సహకార విక్రయ కేంద్రాల ద్వారా ఈ కిట్లను విక్రయించనున్నారు. ఈ ప్యాకేజీలో శనగపప్పు 250 గ్రాములు, పెసరపప్పు 250 గ్రాములు, ఎండుమిర్చి 100 గ్రాములు, ధనియాలు 150 గ్రాములు, వెల్లుల్లి 150 గ్రాములు, చింతపండు 250 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, మినపప్పు (పొట్టు తీసినవి) 100 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, సోంపు 50 గ్రాములు ఉన్నాయి. తొలిదశలో చైన్నెతో పాటు ధర్మపురి, తిరువారూర్‌, పుదుక్కోటై, తంజావూరు, శివగంగ, నాగపట్నం, విల్లుపురం జిల్లాల్లో ఈ విక్రయాలు ప్రారంభమయ్యాయి. శని, ఆది, సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement