వేలూరు: పశుంపొన్ ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం వేలూ రు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఘనంగా జరుపుకున్నారు. వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దేవర్ చిత్ర పటాన్ని ఉంచి వేలూరు దేవర్ పేరవై జిల్లా కార్యదర్శి రాముత్తు దేవర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేవర్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని దేవర్ కులస్తులకు ఎనలేని సేవా కార్యక్రమా లు చేపట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినోద్‌కన్నన్, టీవీకే జిల్లా కార్యదర్శి వేల్మురుగన్, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని దేవర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ప్రధా న పోస్టల్ కార్యాలయం ఎదుట చిత్ర పటానికి పూల మాల వేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, డివిజన్ కార్యదర్శి కుప్పుస్వామి, దేవర్ పేరవై జిల్లా కోశాధికారి శంకర్లింగం, సభ్యులు రామలింగం, దురై పాండియన్, శివస్వామి, పన్నీర్‌సెల్వం, అన్ని వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానవేల్, కోశాధికారి అరుణ్‌ప్రసాద్, అప్పుపాల అధినేత బాలాజీ మొదలియార్, తదితరులు పాల్గొన్నారు.


