కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

వేలూరు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్‌ 12వ తేదీన దుర్గమ్మ ఉత్సవంతో ప్రారంభం కానుంది.ప్రతి సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాలు పది రోజు ల పాటు నిర్వహించడం, ఆఖరి రోజున అరుణాచలేశ్వరాలయం వెనుకునున్న 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించడం ఆన వాయితీ. ఇందులో భాగంగా ఈ సంవత్సరం బ్రహ్మో త్సవాలు నవంబర్‌ 14వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల ముందుగానే దుర్గమ్మ ఉత్సవంతో ఆలయ నిర్వహకులు పూజలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు సా యంత్రం 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. అదే విధంగా దీపోత్సవాన్ని పురష్కరించుకొని ఆలయంలోని తొమ్మిది రాజ గోపురాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణిధరన్‌ అధ్యక్షతన ఆలయ సిబ్బంది వేగవంతం చేశారు.

బందోబస్తు ఏర్పాట్లను పరిశీలన

మహా దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులకు ఎటువంటి శ్రమం లేకండా ఏర్పాట్లు చేయాలని ఐజీ ప్రవీన్‌కుమార్‌ అభినవ్‌ పోలీసులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మహా దీపా న్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు తిరువణ్ణామలై వస్తారని తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో తనఖీలు చేశారు. దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ వినయ్‌, అదనపు కమిషనర్‌ పొన్‌ జయరామన్‌, డీఐజీ మహేష్‌కుమార్‌, ఎస్పీ ఉదయకుమార్‌, ఆలయ జేసీ భరణీధరన్‌తో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement