తమిళ సినిమా: పలు ఓటీటీ సంస్థలు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను రూపొందించి ప్రేక్షకులను రంజింప చేస్తున్నాయి. అలా జియో హాట్ స్టార్ ఓటీటీ సంస్థ తాజాగా రూపొందించిన వెబ్ సిరీస్ లవ్ ఆల్వేస్. మధుమిత దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో నటి గౌరీ జీ. కిషన్, రంజాన్ మహమ్మద్, జయప్రకాష్, జయసుధ, మాయకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. పల్లి ప్రదీప్ కుమార్ రెడ్డి, మైథిలి సత్యజిత్, డింపుల్ ఖన్నా.కే, ఆద్విక్ రవిచంద్రన్, సూరజ్ సీతారామన్, స్మృతి మోహన్ కుమార్, సదాశివం సూర్యనారాయణ్, రామస్వామి మురుగయ్య తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. శబరి వాసన్ ఫజల్ నవాబ్ కథను అందించగా, మెయ్యందిరన్ ఛాయాగ్రహణంను, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించారు. రొమాంటిక్ కామెడీతో ఆకర్షణీయమైన ఫాంటసీ సన్నివేశాలను జోడించి రూపొందించిన అనూహ్యమైన ప్రేమ కథగా వెబ్ సిరీస్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సందర్భోచితమైన హాస్యానికి భావోద్వేగాలను జోడించి ఒక చక్కని వినోదాత్మక ప్రపంచాన్ని ఆశించే కథ అంశంతో 8 ఎపిసోడ్స్‌గా రూపొందించిన లవ్ ఆల్వేస్ వెబ్ సిరీస్ 30వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందని చెప్పారు.
లవ్ ఆల్వేస్ చిత్ర యూనిట్


