తమిళ సినిమా: సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (93) శుక్రవారం ఉదయం చైన్నెలో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా తుది శ్వాస విడిచారు. రంగస్థల నటి అయిన ఈమె తన 60 ఏళ్ల వయసులో సినీ రంగప్రవేశం చేశారు. రోజూ చిత్రంలో నటి మధుబాలకు బామ్మగా నటించి గుర్తింపు పొందారు. అలా సతీ లీలావతి తిరు డా తిరుడి, కాలమల్లా కాదల్ వాల్గా, అన్నియన్, మొ ళి, విన్నర్ మొదలు 400 లకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు తదితర భాషల్లోనూ నటించిన తనసహజమైన నటనతో ప్రేక్ష కులను ప్రేక్షకులను మెప్పించారు. వత్స లా రాజగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక పల్లవరంలోని స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఉంచగా, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శ్రద్ధాంజలి ఘటించారు. శుక్రవారం సాయంత్రం నటి వత్సలా రాజగోపాల్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


