వేలూరు: వేలూరు కర్పగం సూపర్ మార్కెట్‌లో దీపావళి టపాసుల విక్రయాన్ని కలెక్టర్ లీలాఅలెక్స్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి పండుగకు కర్పగం సూపర్ మార్కెట్‌లో కొనుగోలుదారులకు అతి తక్కువ ధరతో టపాసులను విక్రస్తున్నట్లు తెలిపారు. రూ.372 నుంచి రూ.6 వేల వరకు టపాసుల బాక్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా కొన్ని టపాసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. వీటి ధర రూ.200 నుంచి రూ.10 వేల వరకు ఉన్నట్టు పేర్కొన్నారు. గత సంవత్సరం దీపావళి పండుగకు రూ.కోటి విలువైన టపాసులను విక్రయించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం రూ.1.50 కోట్ల విలువైన టపాసులను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివ రించారు. వేలూరులోనే కాకుండా జిల్లాలోని గుడియాత్తం, తిరుపత్తూరు, వాణియంబాడి, వాలాజ, రాణిపేట తదితర ప్రాంతాల్లోని కర్ప గం సూపర్ మార్కెట్లలో అతి తక్కువ ధరకు టపాసులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఎమ్మెల్యే వినోద్‌కన్నన్, కర్పగం సూ పర్ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ పయణిస్వామి, తహసీల్దార్ ఉదయకుమార్, అధికారులు పాల్గొన్నారు.


