తమిళ సినిమా: చిత్ర కథ, కథనాలు ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే విధంగా సాగితే కచ్చితంగా మంచి ఆదరణ పొందుతాయి. అలాంటి వైవిధ్య భరిత కథా కథనాలతో రూపొందిన తాజా చిత్రం పణి విళుమ్ ఇరవు. పవీ క్రియేషన్స్ పతాకంపై సదా మురుగన్, తంగవేల్ వల్లవర్ స్వామి, ఓం సెల్వ కలిసి నిర్మించిన చిత్రమిది. ఎస్‌ఆర్.రాజేష్ దర్శకత్వం వహించారు. ఇందులో అరుణ్ కార్తీ, ఎనాక్షీ గంగూలీ హీరో హీరోయిన్లుగా నటించారు. లవ్ సక్సెస్, థ్రిల్లర్ అంశాలతో రూపొందింది. నిర్మాతల్లో ఒకరైన సదా మురుగన్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ శ్ఙ్రీపణి విళుమ్ ఇరవు అనేది చక్కని కవితాత్మకమైన టైటిల్. నేను పాటల రచయితను కూడా. పలు తమిళ చిత్రాలకు తమిళం అందం, నేతలను చేకూర్చే విధంగా పేర్లు అమరడం లేదు అన్నది బాధాకరం. కాగా ఈ చిత్రానికి అందరికీ అర్ధమయ్యే విధంగా ఈ టైటిల్‌ని పెట్టాం. తమిళంలో ఏడాదికి 300లకు పైగా చిత్రాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరూ చెప్పని కథను పణి విళుం ఇరవు చిత్రంలో చెప్పాము. విచిత్ర కథానాయకుడు అరుణ్ కార్తీ చూడ్డానికి సాధారణంగా ఉన్నా తెరపై తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. విచిత్రం ద్వారా కథానాయకగా పరిచయమైన నటి మీనాక్షి గంగోలి కూడా తన తక్కలున్నట్టలతో చిత్రానికి అదనపు ఆకర్షణగా మారారు. మొదట్లో పాటలు రచయిత, సంగీత దర్శకుడిగా ఈ చిత్రంలోకి వచ్చిన నేను కథ నచ్చడంతో నిర్మాతగాను బాధ్యతలను చేపట్టాను. మరో నిర్మాత జయకుమార్ తంగవేల్ మొదలగు చిత్ర యూనిట్ సహకారంతో ఈ చిత్రాన్ని వైవిధ్య భరితంగా రూపొందించాము. చిత్రాన్ని నిర్మించడం కంటే దాన్ని విడుదల చేయడం పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఈ సవాల్ ఎదుర్కోవడానికి ఏఆర్‌కే ప్రొడక్షన్స్ అధినేతలు ధనశేఖర్, సంజయ్ మాకు అండగా నిలిచారు. చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాముశ్రీశ్రీ అని పేర్కొన్నారు.
నటి, దర్శకులు ఆర్జికతో లవ్ 3.ఓ చిత్ర యూనిట్
వాళ్లు అవకాశాలు
ఇవ్వకపోవడం వల్లే
తమిళసినిమా: ఏ రంగంలోనైనా బ్యాక్ గ్రౌండ్ చాలా ముఖ్యం. ఎలాంటి నేపథ్యం లేని వారు ఏదైనా సాధించాలంటే ప్రతిభ ఒకటే చాలదు. అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని నిలబడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడి దర్శకురాలు, కథానాయకి, సహనిర్మాత ఇలా పలు శాఖలను నిర్వహిస్తున్న ఒక మహిళమణి ఆర్ణిక. రీల్స్ అక్కగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పాపులర్ అయిన ఈమె కథానాయకిగా, దర్శకురాలిగా పరిచయం అవుతూ, కథ, కథనం మాటలు, పాటలు, కళా దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం లవ్ 3.ఓ. మంకీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శివకుమార్ నియమిస్తున్న ఈ చిత్రంలో ఆయన కీలకపాత్రను పోషించడం విశేషం. అదేవిధంగా ఇన్‌స్ట్రాగామ్‌లో పాపులర్ అయిన కోయంబత్తూర్ మా పిళై, కెన్ స్మైలీ అనబడే కార్తికేయన్ ముఖ్య పాత్రలు పోషించారు. వేదై పా.మహేష్ ఛాయాగ్రహణంను, వైకుంఠ్ శ్రీనివాసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మోషన్ పోస్టర్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, పేరరసు, నటి వనితా విజయ్‌కుమార్, నటుడు కూల్ సురేష్ తదితరులు పాల్గొని మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర దర్శకురాలు, కథానాయకి ఆర్ణిక మాట్లాడుతూ శ్ఙ్రీఏఐ ద్వారా కథను తయారు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆ రోజుల్లో తాత, బామ్మలు చెప్పిన విషయాలను తెలుసుకునే వాళ్లం. ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్లు చెప్పే విషయాలను తెలుసుకునే వాళ్లం. ఆపై టీవీ, రేడియో, ఎఫ్‌ఎం ద్వారా పలు విషయాలను తెలుసుకునేవాళ్లం. ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా చాలా నేర్చుకుంటున్నాం .తాజాగా ఇన్‌స్ట్రాగామ్ వాడుకలోకి వచ్చింది. ఇక ఇప్పుడు చాట్ జీపీటీ టెక్నాలజీ అమల్లోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రేమ పుట్టింది. అలా ఏఐ యువతిని ఒక యువకుడు ప్రేమించే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం లవ్ 3.ఓ. గత ఏడేళ్లుగా నటిగా అవకాశాల కోసం పోరాడి ఎంతోమందితో నిరాకరించబడడంతోనే నేను ఇప్పుడు ఇలా ఈ వేదికపై నిలబడ్డాను అని ఆర్ణిక పేర్కొన్నారు.
నయనతార ఈ స్థితిలో ఉన్నారంటే..!
తమిళ సినిమా: నటి నయనతారపై నటి, నిర్మాత కుష్బుసుందర్ సి ప్రశంసల వర్షం కురుపించారు. ‘‘ఆమె ఈ స్థాయిలో ఉన్నారంటే నటనపై ఆమెకు ఉన్న అంకితభావం, క్రమశిక్షణే కారణం. మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో ఒక సన్నివేశం కోసం సుమారు రెండున్నర గంటల పాటు ఒకే చోట కదలకుండా కూర్చున్నారు. కాసేపు విరామం తీసుకోమని చెప్పినా, పర్వాలేదు అని చెప్పారు. ఎందుకంటే ఆ సన్నివేశానికి చాలా సీసీ వర్క్ ఉండటమే అని సుందర్ సి నాకు చెప్పారు. నయనతార పవర్ ఆఫ్ మూక్కుత్తి అమ్మన్ 2’’ అని కుష్బుసుందర్ సి పేర్కొన్నారు. ‘‘ఇక దర్శకుడు సుందర్.సి గురించి చెప్పాలంటే నేను ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. నేను దత్తత తీసుకున్న బిడ్డ సుందర్ సి. గత 31 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురొడ్డి నిలిచారాయన. సుందర్. సి యాక్షన్, కామెడీ, హారర్ కథా చిత్రాలను సక్సెస్ ఫుల్‌గా చేయగలరు. మూక్కుత్తి అమ్మన్ 2 వంటి డివోషనల్ కథా చిత్రాన్ని చేయగలరా అనే సందేహం నాకు కలిగింది. ఈ చిత్రాన్ని అద్భుతంగా చేశారు. ఇందులో నటి రెజీనా, ఊర్వశి, యోగిబాబు వంటి ప్రముఖ నటీనటులు చాలా బాగా నటించారు’’ అని తెలిపారు. ఇటీవల చైన్నెలో జరిగిన మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రం ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో పేర్కొన్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ భారీ బ్రహ్మాండ చిత్రానికి అవ్నీ మూవీస్ అధినేత కుష్బు సుందర్ సి రౌడీ పిక్చర్స్ అధినేతలు నయనతార, విఘ్నేష్ శివన్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. సుందర్.సి దర్శకత్వం వహించిన ఇందులో నటి నయనతార టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 6వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది.


