జపాన్‌ స్టార్‌కు షాకిచ్చిన క్వాలిఫయర్‌ స్వరా కర్మార్కర్‌ | - | Sakshi
Sakshi News home page

జపాన్‌ స్టార్‌కు షాకిచ్చిన క్వాలిఫయర్‌ స్వరా కర్మార్కర్‌

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

● మహిళల సింగిల్స్‌లో స్వరా సంచలన విజయం ● మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అభినంద్‌–దివ్యాన్షి జోడీ ఓటమి

సాక్షి, చైన్నె : తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ ఫీడర్‌ చైన్నె–2026 టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ముగింపు దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌ స్వరా కర్మార్కర్‌ 1–2తో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని, 6వ సీడ్‌ జపాన్‌ క్రీడాకారిణి కొకోనా మురమాట్సును 11–8, 10–12, 13–15, 11–9, 11–7 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. తదుపరి రౌండ్‌లో స్వరా 14 ఏళ్ల తనిష్క కల్భైరవ్‌తో తలపడనుంది. 17వ సీడ్‌ ప్రిషా ఘోయల్‌, 8వ సీడ్‌ స్వాస్తిక ఘోష్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు చేరింది. టాప్‌ సీడ్‌ కొరియా క్రీడాకారిణి యాంగ్‌ హా యూన్‌, 2వ సీడ్‌ యూ జెరిన్‌ తమ తమ మ్యాచ్‌లలో విజయం సాధించారు. ఇక, పురుషుల్లో 3వ సీడ్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌, 14వ సీడ్‌ ప్రియానుజ్‌ భట్టాచార్యతో ఐదు గేమ్‌ల హోరాహోరీ పోరులో 11–9, 8–11, 11–9, 4–11, 11–7 తేడాతో గెలుపొందాడు. సత్యన్‌ తదుపరి రౌండ్‌లో 16వ సీడ్‌ సనీల్‌ శెట్టితో తలపడతాడు. 5వ సీడ్‌ హర్మీత్‌ దేశాయ్‌, 20వ సీడ్‌ పునీత్‌ బిస్వాస్‌ను 11–8, 11–6, 11–9 తేడాతో ఓడించి 21వ సీడ్‌ శ్రీరామ్‌ శివంతో పోరుకు సిద్ధమయ్యాడు. క్వాలిఫయర్‌ నికుంజ్‌ అట్రి, 23వ సీడ్‌ రొనాల్డ్‌ సర్కార్‌పై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.

డబుల్స్‌ – మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫలితాలు

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వాలిఫయర్స్‌ మెహన్‌ సెంథిల్‌ – అనన్య మురళీధరన్‌ జోడీ, 4వ సీడ్స్‌ అభినంద్‌ ప్రధివాది – దివ్యాంశి భౌమిక్‌ను 12–10, 12–10, 3–11, 6–11, 11–7 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. 9వ సీడ్స్‌ అంకుర్‌ భట్టాచార్జీ – సంపద భివాండ్‌కర్‌ జోడీ కొరియాకు చెందిన 7వ సీడ్స్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. టాప్‌ సీడ్స్‌ ఆకాశ్‌ పాల్‌ – సుతీర్థ ముఖర్జీ, 3వ సీడ్స్‌ పయస్‌ జైన్‌ – సయాలీ వానీ తమ మ్యాచ్‌లలో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అలాగే మహిళల డబుల్స్‌లో అనన్య – దివ్యాంశి జోడీ 8వ సీడ్‌ సుహానా సైని – గరిమా గోయల్‌ను 12–10, 11–5, 11–7 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్‌ సీడ్స్‌ తనీషా కోటెచా – స్వస్తిక ఘోష్‌ 6వ సీడ్స్‌పై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement