వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు | - | Sakshi
Sakshi News home page

వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

తిరువళ్లూరు: వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కవిత తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం అగ్రి గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొ న్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పలువురు రైతులు మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కోరారు. పనపాక్కం సహకార బ్యాంకులో రైతుకు తెలియకుండానే రూ.5 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. మహాబలిపురం– ఎన్నూరు, తచ్చూరు–చిత్తూరు, నెమిలిచ్చేరి అవుటర్‌ రింగ్‌ రోడ్డు సహా వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లను ఎత్తుగా నిర్మించడం వల్ల వ్యవసాయ భూముల్లో నీరు వెళ్లడానికి కాలువలు లేక పంటలు మునిగిపోతున్నాయని, కాలువల తవ్వకాలు చేపట్టాలని పలువురు రైతులు కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లాలో 3400 ఎకరాల్లో రూ.71.40 లక్షల సబ్సిడీతో పశుగ్రాసం సాగు చేయడానికి ప్రనాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. రైతులు ముందుకు రావాలని సూచించారు. అలాగే నూతనంగా మరో 70 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు 3,664 మంది రైతుల నుంచి 22,791 మెట్రిక్‌ టన్నుల వరి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అనంతరం రైతులకు వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement