కులగణనకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

కులగణనకు సన్నద్ధం

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

● 8 పరిశ్రమలకు ఆమోదం ● కేబినెట్‌ భేటీలో నిర్ణయం

రిటైర్డ్‌ జస్టిస్‌ నేతృత్వంలో కమిషన్‌

సాక్షి, చైన్నె : సీఎం విజయ్‌ అధ్యక్షతన సచివాలయంలో గురువారం 3వ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం , శాంతిభద్రతలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టీవీకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం మూడో కెబినెట్‌ భేటి కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు,ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశంలో శాంతి భద్రతల అంశాల గురించి సుదీర్ఘంగాచర్చించినట్టు సమాచారం. అలాగే, టీవీకే ఎన్నికల వాగ్దానాల అమల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని కీలక పథకాల అమలు గురించి చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి తొలి ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే, పలు పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడి పె ట్టేందుకు ముందుకు రావడంతో వాటిలో 8 సంస్థలకు అనుమతి ఇస్తూ ఆమోద ముద్ర వేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నిర్మల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

కులాలగణనకు ప్రత్యేక కమిషన్‌

తమిళనాడులో కుల ఆధారిత సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, సమగ్ర కుల గణన నిర్వహించేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పరిశ్రమలు, కంపెనీలను ప్రారంభించే ప్రతిపాదనలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ముస్లిం మతంలోకి మారిన వారి కేసులో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయడానికి ఆమోదం తెలిపారు. అలాగే తాలంబూర్‌ భూ వివాదంపై కోర్టు ఆదేశాల మేరకు చర్చించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల యంత్రాంగం తక్షణమే ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సీఎం విజయ్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని జైళ్లలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అదనపు సీసీటీవీ కెమెరాలు , స్కానింగ్‌ యంత్రాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అరెస్టు వివాదంపై మంత్రి స్పష్టత

ప్రొఫెసర్‌ కలైయరసన్‌ అరెస్టుపై స్పందించిన మంత్రి, పోలీస్‌ శాఖ జరిపిన ఈ అరెస్టు అనుకోకుండా జరిగిన పొరపాటని, ఈ విషయాన్ని ప్రభుత్వం తరపున నేరుగా ఆయనకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల నిధుల కుంభకోణంపై స్పందిస్తూ ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదన్నారు. హైకోర్టు సూచనలు, అందిన ఫిర్యాదుల ఆధారంగానే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఇచ్చే వినతిపత్రాలపై అధికారులు తక్షణమే విచారణ జరిపి, వేగంగా పరిష్కారం చూపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement