సాక్షి, చైన్నె: చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సీఎం – 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు గురువారం రాత్రి జరిగాయి. ఇందులో సీఎం విజయ్ పతకాల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జిల్లాలకు చెందిన విజేతలకు ట్రోఫీలను అందజేశారు.అలాగే, జపాన్‌లో జరిగిన 5వ ఆసియా పారా గేమ్స్‌లో పతకాలు సాధించిన 9 మంది క్రీడాకారులకు రూ. 6.85 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు, క్రీడాకారుల సంక్షేమం కోసం కొత్త స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించారు. సీఎం ట్రోపీలో మొత్తం 319 పతకాలతో అగ్రస్థానంలో నిలిచిన చైన్నె జిల్లాకు సంబంధించిన ట్రోపీని కలెక్టర్ ఎస్. మాలతి హెలెన్ నేతృత్వంలోని క్రీడాకారులకు ట్రోఫీని సీఎం అందజేశారు. తొలి స్థానం (చైన్నె) 142 స్వర్ణ, 97 రజత, 80 కాంస్య పతకాలు సాధించింది. రెండవ స్థానంలో చెంగల్పట్టు జిల్లా 64 స్వర్ణ, 43 రజత, 36 కాంస్య పతకాల అంటూ మొత్తం: 143 పతకాలతో, మూడవ స్థానం లో కోయంబత్తూరు 27 స్వర్ణ, 37 రజత, 54 కాంస్య పతకాలు అంటూమొత్తం: 118 పతకాలను సాధించింది.ఈ క్రీడా పోటీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 27.82 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, జిల్లా, మండల , రాష్ట్ర స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం రూ. 38 కోట్ల ప్రైజ్ మనీ పంపిణీ చేశారు. అలాగే, ఆసియా పారా గేమ్స్ విజేతలకు భారీ నగదు బహుమతులు రూ. 6.85 కోట్లు అందజేశారు.
కొత్త పథకం : రామనాథపురం జిల్లా ప్రప్పన్వలసైలో రూ. 42.90 కోట్లతో నిర్మించిన తమిళనాడు ఒలింపిక్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, సేలం జిల్లా కరుప్పూర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో రూ. 20 కోట్లతో నిర్మించిన మల్టీ–పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సీఎం విజయ్ ప్రారంభించారు.అలాగే, డ్రీమ్ ఒలింపిక్‌నినాదంతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇక, హాస్టళ్లలో శిక్షణ పొందుతున్న 2,600 మంది క్రీడాకారుల వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 500 నుండి రూ. 1,000 వరకు ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభిస్తూ, ఏడాదికి రూ. 1.77 కోట్ల వ్యయం అందజేశారు.ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, క్రీడా ప్రాధికార అధికారులు ,పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.


