తమిళసినిమా: ప్రస్తుతం క్రేజీ కథానాయకుడిగా, హాస్యనటుడు రాణిస్తున్న నటుడు యోగిబాబు. ఏం తరహా పాత్రలనైనా తనదైనశైలిలో నటించే సత్తా కలిగిన ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో అర్జనన్ పేర్ పత్తు. ఇది యోగి బాబు నటించిన 300వ చిత్రం కావడం విశేషం. దేవ్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఆర్. రాజ్ మోహన్ దర్శకత్వం వహించారు.నటి అనామిక మహీ నాయకిగా నటించారు.కాళీవెంకట్, అరుళ్ దాస్,అయిలీ మదన్, సుబ్రహ్మణి శివ, మైనా నందిని , సౌందర్య,సెండ్రాయన్,హలో కందసామి,పావా లక్ష్మణ్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు దర్శకుడు లెనిన్ భారతి కీలక పాత్రను పోషించారు. డీ.ఇమాన్ సంగీతాన్ని, ప్రదీప్ కాళీరాజా ఛాయాగ్రహణంను అందించిన అర్జనన్ పేర్ పత్తు చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎడిటింగ్ తదితర నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా చిత్రాన్ని నవంబర్ 27వ తేదీన తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలైన ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణను పొందింది. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రేయింబవళ్ళు శ్రమించి ఒక వాహనాన్ని కొనుగోలు చేయగా, అది దొంగతనానికి గురౌతున్నారు. దాన్ని కనుక్కోవడానికి ఆ యువకుడు చేసే ప్రయత్నంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని,ఆ వాహనాన్ని పలువురు సొంతంగా భావిస్తారనీ, అలా వాహన మాఫియా ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ఇదని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు.


