విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

సాక్షి, చైన్నె: చైన్నె ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.పర్ఫొరేటెడ్‌ లీఫ్‌లెట్‌ సమస్యతో తీవ్రమైన గుండె వాల్వ్‌ లీకేజీ తో బాధపడుతున్న 63 ఏళ్ల వృద్ధుడికి అత్యాధునిక హ్యాంకర్‌ వాల్వ్‌ పరిజ్ఞానం ద్వారా ట్రాన్స్‌కాథెటర్‌ ఆరోటిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ పూర్తి చేశారు. గతంలో మైట్రల్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ పొందిన రోగికి, పర్ఫొరేటెడ్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ లీఫ్‌లెట్‌ ఉండి, ఈ ప్రత్యేక హ్యాంకర్‌ వాల్వ్‌ను ఉపయోగించిటీఏవీఆర్‌ శస్త్రచికిత్స చేయడం ఇదే తొలి సారి అని వైద్యుల బృందం ప్రకటించింది. రోగికి ఎదురైన సమస్యను ఎదుర్కొనేందుకు నిటినాల్‌ అనే ప్రత్యేక లోహ మిశ్రమంతో తయారైన హ్యాంకర్‌ వాల్వ్‌ ఉపయోగించారు. ఇది వాల్వ్‌ను సరిగ్గా పట్టి ఉంచేందుకు సహాయపడుతుంది. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అవసరం లేకుండా, కాథెటర్‌ సహాయంతో చాలా స్వల్ప వ్యవధిలో ఈ వాల్వ్‌ను విజయవంతంగా అమర్చారు. ఈసందర్భంగా సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షన్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ డాక్టర్‌ రాజారామ్‌ అనంతరామన్‌ మాట్లాడుతూ, క్యాల్షియం తక్కువగా ఉండటం, వాల్వ్‌ రంధ్రం , గతంలో మైట్రల్‌ వాల్వ్‌ మార్పిడి జరగడం వల్ల ఈ కేస్‌ చాలా సంక్లిష్టంగా మారిందన్నారు. హ్యాంకర్‌ వాల్వ్‌ సాంకేతికత తమకు సరైన స్థానంలో వాల్వ్‌ను అమర్చడానికి తోడ్పడిందన్నారు.. చికిత్స తర్వాత లీకేజీ పూర్తిగా తగ్గిపోయిందని, రోగి ఆరోగ్యంగా కోలుకుని మూడవ రోజే డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కో ఫౌండర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement