సాక్షి, చైన్నె: ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని చైన్నె లోని పవన్స్ రాజాజీ విద్యాశ్రమ్ పాఠశాల విద్యార్థులతో కలసి అపోలో హాస్పిటల్స్, అపోలో షైన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఒక బృహత్తర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, తక్షణ వైద్య చికిత్స పొందడం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, 1,066 మంది విద్యార్థులు ఎఫ్ఏఎస్టీ అనే ఆంగ్ల అక్షరాల రూపంలో మానవహారాన్ని) ఏర్పాటు చేసి సందేశాన్ని చాటారు. ఈ వినూత్న కార్యక్రమానికి తమిళనాడు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి రాజమోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అపోలో చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇళంగుమారన్ కళీయమూర్తి, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసన్ పరమశివం, ఆ విద్యాశ్రమ్ ప్రిన్సిపాల్ పి.జి. సుబ్రమణియం పాల్గొన్నారు.


