కొరుక్కుపేట: దక్షిణ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) అయిన ఆర్. సెంథిల్ కుమార్ ఐఆర్‌టిఎస్, దక్షిణ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ (ఎస్‌ఆర్‌ఎస్‌ఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌ఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుని హోదాలో, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ అయిన ఆర్.సెంథిల్ కుమార్ ఐ ఆర్ టి ఎస్, రైల్వే క్రీడాకారుల అభివృద్ధి, శిక్షణా సౌకర్యాల మెరుగుదల, క్రీడా మౌలిక సదుపాయాల బలోపేతం, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. రైల్వే ఉద్యోగులలో క్రీడా ప్రతిభను పెంపొందించడంలోనూ, వివిధ స్థాయిల పోటీలలో క్రీడాకారులు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు కల్పించడంలోనూ సదరన్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన నాయకత్వంలో, సదరన్ రైల్వేలో క్రీడల ప్రోత్సాహం , అభివృద్ధిపై ఎస్ ఆర్ ఎస్ ఏ దృష్టి సారించడం కొనసాగిస్తుంది. పద్మశ్రీ, అర్జున అవార్డులు, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య , ఖేల్ రత్న అవార్డుల వంటి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు పొందిన ఎందరో క్రీడా తారలను భారతీయ రైల్వే అందించింది. దక్షిణాది నుండి ఈ రంగంలో అత్యధికంగా తోడ్పాటు అందిస్తున్న సంస్థలలో ఎస్‌ఆర్‌ఎస్‌ఏ ఒకటి. ఎస్ ఆర్ ఎస్ ఏ వారసత్వాన్ని కొనసాగిస్తున్న తాజా తారలు జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో పి.టి. ఉష 42 ఏళ్ల నాటి 400 మీటర్ల హర్డిల్స్ జాతీయ రికార్డును బద్దలు కొట్టి 3 పతకాలు గెలుచుకున్న విద్యా రామ్‌రాజ్ (పాలక్కాడ్ డివిజన్), మహిళల పోల్ వాల్ట్‌లో భారతదేశానికి మొట్టమొదటి ఆసియా క్రీడల పతకాన్ని (కాంస్యం 2026) సాధించి చరిత్ర సృష్టించిన బరానీకా ఎలాంగోవన్, పురుషుల రిలేలో కాంస్యం గెలుచుకున్న ఆర్. రాజేష్ (తిరుచ్చి) ఉన్నట్టు గుర్తుచేశారు.


