గ్రేటర్‌ చైన్నె ట్రాఫిక్‌ పోలీసులకు 51 వాహనాలు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ చైన్నె ట్రాఫిక్‌ పోలీసులకు 51 వాహనాలు

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

సాక్షి, చైన్నె: హోండా గ్రూప్‌ కంపెనీల సీఎస్‌ఆర్‌ విభాగమైన హోండా ఇండియా ఫౌండేషన్‌ గ్రేటర్‌ చైన్నె ట్రాఫిక్‌ పోలీసుల క్షేత్రస్థాయి పర్యవేక్షణా పనుల కోసం 51 అత్యవసర వాహనాలను అందజేసింది. చైన్నె నగర వ్యాప్తంగా రహదారి భద్రత, అత్యవసర ప్రతిస్పందన, గస్తీ నిర్వహణను వేగవంతం చేయడం ఈ ప్రాజెక్ట్‌ యొక్క ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. పోలీసు విధుల కోసం ప్రత్యేక మార్పులు చేసిన 50 హోండా సీబీ 350 మోటార్‌సైకిళ్లు, ఒక హోండా ఎలివేట్‌ కారుఇందులో ఉన్నాయి. ఈ వాహనాలకు డ్యూయల్‌–టోన్‌ సైరన్లు, పబ్లిక్‌–అడ్రెస్‌ సిస్టమ్‌లు, ఎల్‌ఈడీ అత్యవసర లైట్లు, పోలీస్‌ డిస్‌ప్లే బోర్డులు అమర్చారు. మోటార్‌సైకిళ్లకు విండ్‌స్క్రీన్‌లు, స్టోరేజ్‌ బాక్సులను కూడా జత చేశారు. ఈ పంపిణీ అనేది హెచ్‌ఐఎఫ్‌ చేపట్టిన సడక్‌ సహాయక్‌ – సురక్షిత్‌ మార్గ్‌, సురక్షిత్‌ జీవన్‌ కార్యక్రమంలో భాగం నిర్వహించారు. దీని ద్వారా ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎమర్జెన్సీ కేర్‌ అనే సమగ్ర వ్యూహంతో రోడ్డు భద్రతకు ఆదర్శ నగరంగా చైన్నెని తీర్చిదిద్దడానికి హోండా కృషి చేస్తుందని ప్రకటించారు. గ్రేటర్‌ చైన్నె పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ. అమల్‌రాజ్‌, హోండా మోటార్‌సైకిల్‌ – స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రభు నాగరాజ్‌ సమక్షంలో ఈ వాహనాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement