సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నె నుంచి సముద్ర తీరం వెంబడి పుదుచ్చేరి వరకు 135 కి.మీ దూరం ఈస్ట్ కోస్ట్ రోడ్డు(ఈసీఆర్)లో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చైన్నె నగరం విస్తరిస్తుండటంతో ఈసీఆర్‌లో నిర్మాణాలు మరీ ఎక్కువే. బహుళ అంతస్తుల భవనాలు కోకొల్లలు. అనేక విదేశీ, స్వదేశీ సంస్థలు, ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ ఎక్కువే. నిర్మాణ పరంగా, అభివృద్ధి పరంగా శరవేగంగా ఈ పరిసరాలు దూసుకెళ్తోన్నాయి. కోవళం, మహాబలి పురం, ముట్టుకాడు వంటి పర్యాటక కేంద్రాలు, థిమ్ పార్క్‌లు, రిసార్ట్స్‌లు కూడా ఈపరిసరాల్లోనే ఉన్నా యి. ఈ పరిస్థితుల్లో ఈసీఆర్ రోడ్డును రాష్ట్ర ప్రభు త్వం తన పరిధిలోకి తీసుకుని అభివృద్ధి పరిచే పనులను వేగవంతం చేసింది. ఇక ఈసీఆర్ రూపుదిద్దుకునేందుకు ముందుగా మధ్య కై లాశ్ నుంచి నావలూరు మీదుగా ఓఎంఆర్(ఓల్డ్ మహాబలిపురం) రోడ్డును ఉపయోగించే వారు. ఇప్పుడు కూడా ఈ రోడ్డు ఉపయోగించడం జరుగుతోంది. ఈ మార్గంలోనూ ఐటీ సంస్థలతో పాటుగా విద్యా సంస్థలు, ఆధునిక నాగరికతను చాటే విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు అంటూ, ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన నిర్మాణాలతో కిలో మీటర్ల కొద్ది ఓఎంఆర్, ఈసీఆర్ రోడ్లు, ఆ పరిసరాలు విస్తరించి ఉన్నాయి. అదే సమయంలో ఓఎంఆర్ వెంబడి సిరుచ్చేరి వరకు ఓ వైపు, షోళింనల్లూరు వరకు మరో వైపు మెట్రో రైలు సేవల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ రెండు మార్గాలలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనాలు చిక్కాల్సిందే. ఓఎంఆర్ నుంచి ఈసీఆర్‌లోకి వాహనాలు వెళ్లాంటే కష్టం. అదే విధంగా ఈసీఆర్ నుంచి ఓఎంఆర్ రావాలన్నా చక్క ర్లు కొట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఓఎంఆర్ – ఈసీఆర్‌లను అనుసంధానించేందుకు ఇది వరకు కేళంబాక్కం నుంచి కోవలం వైపుగా ఉన్న మార్గం ఉంది. దీనిని ఉపయోగించే వాళ్లు మరీ ఎక్కువే. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. దీనిని పరిగణించిన రహదారుల శాఖ ఎట్టకేలకు ఈసీఆర్ , ఓఎంఆర్‌లను అనుసంధానించేందుకు సిద్ధం అయింది.
ప్రాజెక్ట్ నేపథ్యం – రద్దీ నివారణ
చైన్నెలో అడయార్ మధ్య కై లాశ్ వద్ద ప్రారంభమై మహాబలిపురం వరకు విస్తరించి ఉన్న ఓఎంఆర్ రోడ్డు, తిరువాన్మియూర్ నుండి పుదుచ్చేరి వరకు వెళ్లే ఈసీఆర్ రోడ్డు నగరానికి ప్రధాన రవాణా మార్గాలుగా ఉండటంతో తాజాగా వీటిని అనుసంధానించక తప్పడం లేదు. రోజూ వేలాది మంది ఐటీ, ఇతర ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు ఈ మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం షోళింగనల్లూరు – అక్కరై, కేలంబాక్కం – కోవలం మధ్య లింక్ రోడ్లు అందుబాటులో ఉండగా, తురైపాక్కం – నీలన్‌కరై మధ్య కొత్త అనుసంధాన రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ లింక్ రోడ్డులు ఇరుకుగానే ఉంటాయి. కొట్టివాక్కం, నీలం కరై, ఈంజంబాక్కం పరిసరాల్లో నివాస ప్రాంతాలు పెరగడంతో షోళింగనల్లూరు – అక్కరై లింక్ రోడ్డుపై తీవ్ర వాహన రద్దీ ఏర్పడుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించి, రెండు రహదారుల మధ్య గమనాన్ని సులభతరం చేసేందుకు ఈ కొత్త రహదారిని ప్రతిపాదించారు.
పదేళ్ల నిరీక్షణకు ఫలితం..
2016లో ఈ రెండు ప్రధాన మార్గాలను అనుసంధానించే రీతిలో కసరత్తులు జరిగాయి. ఈమేరకు తురైపాక్కం – నీలాంకరై లింక్ రోడ్డు ప్రాజెక్టుకు కసరత్తుల జరిగాయి.అయితే, కోర్టు కేసులు, భూసేకరణ జాప్యం కారణంగా పదేళ్లుగా ఆ పనులు ఆగాయి. ఈ అనుభవంతో కొత్త ప్రాజెక్ట్‌ను మరింత జాగ్రత్తగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే డీపీఆర్‌ను జాగ్రత్తతో, ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి, పనులకు భవిష్యత్‌లో ఆటంకం కలగకుండా కార్యాచరణలో నిమగ్నమ్యారు.
కొత్త రహదారికి టెండర్లు
ఈసీఆర్–ఓఎంఆర్‌ను అనుసంధానిస్తూ రహదారి నిర్మాణానికి రహదారుల శాఖ సిద్దం కావడంతో వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక రూపకల్పనపై దృష్టి పెట్టారు. ఇందు కోసం టె ండర్లను ఆహ్వానించారు. ఆసక్తి ఉన్న సంస్థలు నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు టెండర్లు ముగించనున్నారు. ఎంపికై న కన్సల్టింగ్ సంస్థ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి 3 నెలల వ్యవధిలో నివేదికను అందజేయాల్సి ఉంటుంది. నివేదికలో అధ్యయనం చేసే ప్రధాన అంశాలుగా భూమి సర్వే – రవాణా లెక్కింపు, అనువైన మార్గం ఎంపిక , ఇంజనీరింగ్ డిజైన్లు. తప్పని సరిగా ఉన్నాయి. భూసేకరణ అంచనాలో రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి పరిమాణాన్ని లెక్కించాల్సి ఉటుంది. వర్షపు నీటి పారుదల సౌకర్యాలపై ముందస్తు ప్రణాళిక. నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు, ప్రయాణ సమయం తగ్గుదల , వాహనదారుల భద్రతను ప్రాతిపదికగా తీసుకుని డీపీఆర్ సిద్ధం చేసేందుకు నిర్ణయించారు. కీలకంగా ఈ ప్రాజెక్టులో ఓఎంఆర్, ఈసీఆర్ మధ్య తూర్పు – పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే విధంగా రహదారి రూట్ మ్యాప్ సిద్ధంచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరణాత్మక నివేదిక సిద్ధం చేయడానికి రూ. 14.20 లక్షలు కేటాయించారు. ఇక, ట్రాఫిక్ రద్దీ, వాహనాల సంఖ్య, పాదచారుల రద్దీ, వర్షపు నీటి పారుదల, ఫ్లైఓవర్లు, కూడళ్లు, భూగర్భ సేవలు (విద్యుత్ కేబుళ్లు, నీటి పైపులు మొదలైనవి) అన్నీ ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకుంటారు.


