మాజీ ఎమ్మెల్యేల కేసులో జరిమానా రద్దు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యేల కేసులో జరిమానా రద్దు

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

సాక్షి, చైన్నె: రాజీనామా చేసిన ఆరుగురు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేల నుంచి ఎన్నికల ఖర్చు వసూలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో పిటిషనర్‌కు విధించిన రూ. లక్ష జరిమానాను మద్రాసు హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నాడీఎంకేవ విప్‌ ఆదేశాలను ఉల్లఘించి టీవీకే ప్రభుత్వానికిమద్దతుగా ఓటు వేసిన ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఆ తదుపరి వారు టీవీకేలో చేరారు. అయితే వీరి రాజీనామా కారణంగా వచ్చే ఉప ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చును వారి నుంచే రాబట్టాలనికోరుతూ న్యాయవాది ఎస్‌. కాశీరామలింగం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌తో కూడిన ధర్మాసనం ఇదే తరహా అభ్యర్థనతో దాఖలైన మరొక కేసును ఇప్పటికే కొట్టివేశామని గుర్తుచేశారు. అయినా పిటిషనర్‌ తన వాదనలను కొనసాగించడంతో, కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను రూ. లక్ష జరిమానా విధిస్తూ పిటిషనన్‌ను కొట్టివేశారు. ఈ జరిమానా విధించిన ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ న్యాయవాది కాశీ రామలింగం మరల హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు గతంలో విధించిన రూ. లక్ష జరిమానా ఉత్తర్వును రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.

టీవీకే ప్రభుత్వం ఉన్నంత కాలం స్వాతంత్య్రం లేదు

– ఎం.కె. స్టాలిన్‌

సాక్షి, చైన్నె : టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం తమిళనాడుకు ఎప్పటికీ స్వేచ్ఛ లభించదని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ తీవ్రంగా విమర్శించారు. చైన్నెలోని అడయార్‌లో పట్టపగలు నడిరోడ్డుపై ఒక యువకుడిని ముగ్గురు వ్యక్తుల ముఠా అతి క్రూరంగా నరికి హత్య చేసి పరారైన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఎం.కె. స్టాలిన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. జైలు అయినా, పాఠశాల అయినా, రహదారి అయినా, లేదా కోర్టు అయినా.. రాష్ట్రంలో ఎక్కడా సామాన్య ప్రజలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.సీఎం నుంచి ఈ ఘటనలపై కనీస స్పందన లేదన్నారు. అధికారులకు సరైన దిశానిర్దేశం కొరవడిందని మండి పడ్డారు. ఫలితంగా నేరస్థులకు పోలీసులంటే భయం లేకుండా పోయిందన్నారు. టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం తమిళనాడులో శాంతిభద్రతలు మనుగడ సాగించలేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేని కందమానూరు సమీపంలోని జిల్లా జైలులో 17 మందిఖైదీలు పరారీ కావడం, సేలం జిల్లా అత్తయ్యంపట్టి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసుల కళ్లుగప్పి ఇద్దరు రౌడీల స్టేషన్‌ నుంచి తప్పించుకోవడం, వంటిఘటనలను గుర్తు చేస్తూ, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి దారుణ ఘటనల నేపథ్యంలో, ఈ టీవీకే ప్రభుత్వం కొనసాగినంత కాలం తమిళనాడు ప్రజలకు భద్రత లేదని, వారి ఆశలన్నీ అడియాలే అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

చైన్నెలో విద్యుత్‌ అంతరాయం

– రెండున్నర గంటల పాటూ ఆగిన రైలు సేవలు

సాక్షి, చైన్నె : చైన్నెలోని వాషర్‌మన్‌పేట్‌ – రాయపురం మధ్య ఉన్న ఎలివేటెడ్‌ రైల్వే లైనన్‌లో విద్యుత్‌ లోపం తలెత్తడంతో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండున్నర గంటలకు పైగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం ఉదయం 5:15 గంటలకు ఓవర్‌హెడ్‌ లైనన్‌లో సాంకేతిక సమస్యతో విద్యుత్‌ సరఫరాలో ఆటంకం నెలకొంది. దీంతో చైన్నె బీచ్‌ – అరక్కోణం , గుమ్మిడిపూండి మార్గాల్లో నడిచే ఎలక్ట్రిక్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయాన్నే చైన్నె వైపుగా ఆయా ఫ్రాంతాల నుంచి ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం రావాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సమాచారంఅ ందుకున్న రైల్వే వర్గాలు సుమారు రెండున్నర గంటల పాటుగా శ్రమించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఉదయం 7.45 గంటల నుంచి రైలు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. వాషర్‌మన్‌పేట్‌–రాయపురం ట్రాక్‌ ప్రధాన అనుసంధాన మార్గం కావడంతో రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. దీనివల్ల ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు , కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకదాని తర్వాత మరొకటి చైన్నె శివారులలో ఆగాయి. పునరుద్దరణ అనంతరం ఆలస్యంగా సెంట్రల్‌ వైపుగా రైళ్లు వచ్చి చేరాయి. దీంతో వాటిలో ప్రయాణించిన వారికి తీవ్ర అవస్థలు తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement