రాణిపేటలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి రేణిగుంటలో గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

రాణిపేటలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి రేణిగుంటలో గుర్తింపు

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● ఐదుగురి అరెస్ట్‌

వేలూరు: తమిళనాడులోని రాణిపేట జిల్లా లాలాపేట ప్రాంతానికి చెందిన శేఖర్‌, ప్రేమ దంపతులు వ్యర్థ పదార్థాలను సేకరస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఈ ఏడాది సెప్టెంబర్‌ 24వ తేదిన రాత్రి రాణిపేట సమీపంలోని వాణియంబాడి రోడ్డులోని మాణిక్యం నగర్‌లోని ఓ ప్రవేటు ఫ్యాక్టరీ పక్కన తమ ఏడాది వయస్సున్న కుమార్తె మహేశ్వరితో కలిసి నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఉన్న ఫలంగా కుమార్తె మాయమైంది. దీంతో ఆ దంపతులు సిప్‌కాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే చిన్నారి ఆచూకీ కనిపించక పోవంతో ఎస్పీ పర్వవేక్షణలో ఐదు ప్రత్యేక పోలీస్‌ బృందాలు ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా పోలీసులు పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. వీటిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేసి ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు, ఆ సమయంలో వచ్చిన వాహనాలు తదితర వాటితో పాటు చిన్నారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌ నెంబర్‌ల ఆధారంగా పలు చోట్ల విచారణ చేపట్టారు. ఆ సమయంలో చిన్నారి ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట ప్రాంతంలోని మల్లేశ్వరి అనే మహిళ ఇంటిలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి సమయంలో పోలీసులు మల్లేశ్వరి ఇంటికి వెళ్లి చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చారు. రేణిగుంటకు చెందిన మల్లేశ్వరి అనే మహిళకు భర్త మృతి చెందడంతో ఆమెకు సంతానం కూడా లేదు. అగ్రవరం గ్రామానికి చెందిన కౌసల్య, ఆమె భర్త భూపతి, సంతోష్‌, కుమార్‌ కలిసి చిన్నారిని తీసుకెళ్లి మళ్లీశ్వరికి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో సిప్‌కాడు పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement