ఐటీఐల్లో అత్యాధునిక ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌లు సెకెండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఐటీఐల్లో అత్యాధునిక ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌లు సెకెండ్‌

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● 673 మందికి నియామక పత్రాలు ● అందజేసిన సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె : తమిళనాడులోని ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణా సంస్థలలో (ఐటీఐ) మౌలిక వసతులు, సాంకేతిక విద్యను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైన్నె గిండిలోని ప్రభుత్వ వృత్తి శిక్షణా సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం విజయ్‌ ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌లను ప్రారంభించారు. అలాగే, చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, వెల్లూరు, కోయంబత్తూర్‌, మధురై, సేలం, తిరుచ్చితో సహా 23 జిల్లాల్లోని 30 ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణా సంస్థలలో ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ సంస్థ అందించిన రూ. 5.10 కోట్ల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అధునాతన విద్యుత్‌ ప్రయోగశాలలను (కూడా సీఎం విజయ్‌ ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 9,250 మంది విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ లభించనుంది.

మరో 40 ఐటీఐల కోసం ఒప్పందం:

మరో 40 ప్రభుత్వ ఐటీఐలలో రూ. 6.80 కోట్ల వ్యయంతో ఆధునిక ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ , ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఇండియా ప్రతినిధుల మధ్య సీఎం విజయ్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఎలక్ట్రీషియన్‌, వైర్‌మ్యాన్‌ విభాగాల విద్యార్థులకు ఆధునిక శిక్షణా పరికరాలను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయి లో జరిగిన 59వ నైనుణ్యాల పోటీలలో విజేతలుగా నిలిచిన 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 25 వేలు చొప్పున నగదు బహుమతికి గాను చెక్కులను సీఎం అందజేశారు. అఖిల భారత వృత్తి విద్యా పరీక్షలలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి రాష్ట్రానికి ఘనత తెచ్చిన 60 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గతేడాది 40 మంది అగ్రస్థానం సాధించి 4వ స్థానంలో ఉన్న తమిళనాడు, ఈ ఏడాది 60 మందితో దేశంలోనే రెండవ స్థానానికి చేరడం విశేషం. అలాగే తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉపాధి , శిక్షణ రంగానికి కొత్తగా ఎంపికై న 673 మంది జూనియర్‌ శిక్షణా అధికారులకు నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. అలాగే, ఆ ప్రాంగణంలోని రోబోటిక్స్‌, అధునాతన సీఎన్‌సీ, లేజర్‌ కటింగ్‌, హైడ్రాలిక్‌ , న్యూమాటిక్స్‌ ల్యాబ్‌లను సీఎం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. దివ్యాంగులపై విద్యార్థులకు, జపానన్‌లోని ఎహిమే నిస్సాన్‌ కంపెనీకి ఎంపికై న విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ , నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహమ్మద్‌ పర్వేజ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎం. సాయికుమార్‌, ఉపాధి , శిక్షణ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సి. పళని, ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఎండీ దీపక్‌ శర్మ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement