తిరువళ్లూరు: అన్నాయూనివర్సిటీ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్‌కుప్పంలోని ప్రత్యూష్ ఇంజినీరింగ్ కళాశాల ఆద్వర్యంలో 26, 27 తదితర రెండు రోజుల పాటు నిర్వహించారు. పోటీలకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన 22 కళాశాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో సెమీస్, ఫైనల్ పోటీలు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఫైనల్‌కు ఆర్‌ఎంకే ఇంజినీరింగ్ కళాశాల, వేళమ్మాల్ కళాశాల జట్లు చేరాయి. వీరి మధ్య జరిగిన పోటీల్లో ఆర్‌ఎంకే కళాశాల జట్టు 8–0 తేడాతో విజయం సాధించి చాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది. కాగా వాలీబాల్‌లో విజయం సాధించిన జట్టును ఆర్‌ఎంకే కళాశాల చేర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం ప్రశంసించారు. అనంతరం ఆయన రూ. 50 వేల ప్రోత్సాహక నగదు బహుమతిని విద్యార్థులకు అందజేశా రు. ఉపాధ్యక్షుడు ఆర్‌ఎం కిషోర్, ప్రిన్సిపల్ మహ్మ ద్ జునైత్ తదితరులు పాల్గోన్నారు. కాగా చాంపియన్‌గా నిలిచిన ఆర్‌ఎంకే కళాశాల జట్టు మండల స్థాయిలో జరిగే పోటీలకు అర్హతను సాధించింది.


