తిరుత్తణి: పొన్పాడి చెక్‌పోస్టు వద్ద మంత్రులు సెంగోట్టయన్, వెంకట్రమనన్ బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టి రాష్ట్ర సరిహద్దు మార్గాల్లో రేషన్ బియ్యం తరలింపుపై నిఘా వుంచి కట్టడి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పాలిస్ వేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పిర్యాదుల నేపధ్యంలో మంత్రుల నేపధ్యంలో రెవిన్యూ శాఖ మంత్రి సెంగోట్టయన్, పౌరసరపరాల శాఖ మంత్రి వెంకట్రమనన్ తదితరులు తిరుత్తణి సమీపంలోని చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని తమిళనాడు ఆంధ్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేసారు. చెక్‌పోస్టులో రికార్డులను పరిశీలించిన మంత్రుల బృందం ఇతర రాష్ట్రాల వాహనాలను, రాష్ట్రం నుంచి ఆంధ్రాకు ప్రవేశిస్తున్న గూడ్సు వాహనాలు తనిఖీ చేపట్టాలని, రేషన్ దుకాణాల్లో ఉచితంగా అందజేస్తున్న రేషన్ బి య్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు.


