– నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఎన్నూరు గ్రామానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక స్థానికంగా వున్న పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూవుంది. ఈక్రమంలో గత 2018, డిసంబర్ 28న ఇంటి వద్ద వుంటున్న మైనర్ బాలికకూ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లిన అదే ప్రాంతానికి చెందిన పీటర్(22) పలుమార్లు లైంగిక దాడికి దిగాడు. లైంగిక దాడి విషయాన్ని బయట చెబితే అంతచూస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో బాలిక ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లి ఎన్నూర్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో పీటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితుడు బెయిల్‌పై విడుదలైన క్రమంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ ముగియడంతో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి దిగిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, 25 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు.
మహిళను చంపి
బావిలో పడేసిన వ్యక్తి అరెస్టు
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా,మధురాంతకం ఉత్కోట్టం, మెల్ మరువత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శిరునగలూరు గ్రామంలో మనవాలనాయుడు అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ బావిలో, సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక మహిళ గొంతు కోసి ఉన్న మృతదేహం తేలుతూ కనిపించిందని సమాచారం అందింది. దీని ప్రకారం గ్రామ పరిపాలనాధికారి శారద దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు మెల్మరువత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముగింపులో మృతురాలు చైన్నె తీరప్రాంతానికి చెందిన గురు నాథన్ (41) భార్య మణిమేఘలై అని తేలింది. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న కడలూరు జిల్లాలోని ఎంజీఆర్ దిట్టు ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమారుడు మధురవేల్ (43)ను చైన్నెలో అరెస్టు చేశారు. అతనితో జరిపిన విచారణలో మృతురాలు మణిమేఘలై అతని వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వనందున, ఆమెను హత్య చేసి ఆమె చెవిపోగులు, చైయిన్, సెల్ ఫోన్ తీసుకుని, ఆమె మృతదేహాన్ని ఒక బావిలో పడేశాన ని అతను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చిరుత దాడిలో దూడ మృతి
సేలం: గత నెలలో సేలం జిల్లా, మెట్టూరు తాలూకా, కొళత్తూరు సమీపంలోని కన్నమూచి ప్రాంతంలో సంయుక్త ఆపరేషనన్‌లో ఒక చిరుతను పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి కన్నమూచిలోని పశ్చిమ పిటంగనేరిలో ఒక రైతు దూడపై చిరుత దాడి చేసింది. ఆ దూడ అరటి తోటలో చనిపోయి కనిపించింది. ఈ దృశ్యంతో ఆ ప్రాంత ప్రజలు మరోసారి భయాందోళనలకు గురయ్యారు.


