పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లభిస్తుంది..! | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లభిస్తుంది..!

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

– బీజేపీ రాజ్యసభ ఎంపీ సెల్వ గణపతి ఽధీమా

సాక్షి, చైన్నె: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి త్వరలోనే రాష్ట్ర హోదా లభిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సెల్వ గణపతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తోందని సెల్వ గణపతి మండిపడ్డారు. ఓటర్ల నమోదు ప్రక్రియ తర్వాతే కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిందన్నారు. అక్కడ లేని రిగ్గింగ్‌ ఇక్కడే జరిగిందా? అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేస్తున్నట్టు ఆయన అన్నారు. నిరసనల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారని, ఈ ఆందోళనలను రెచ్చగొట్టడానికి విదేశీ శక్తుల నుంచి నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే విద్యార్థులకు వాస్తవాలను వివరించడంతో నిరసనల్లో వారి భాగస్వామ్యం క్రమంగా తగ్గుతోందన్నారు. 2014 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధికార దాహంతో అనేక రకాల ఆందోళనలు చేపడుతోందని ధ్వజమెత్తారు. ఎలాంటి లోపాలు లేకుండా నిష్పాక్షికంగా ఓటర్ల ప్రత్యేక సవరణ పనులు జరగాలనేదే ఎన్నికల సంఘం ఉద్దేశమని స్పష్టం చేశారు.

రాష్ట్ర హోదాపై స్పష్టత

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ ఇప్పటికే రాజ్యసభలో మూడుసార్లు మాట్లాడానన్నారు. ప్రస్తుతం అందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు పుదుచ్చేరికి ఖచ్చితంగా రాష్ట్ర హోదా లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి మద్దతుగా ఈనెల 31న పుదుచ్చేరిలో బీజేపీ తరఫున భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement